ఒక ఎమ్మెల్సీ సీటు… ఇద్దరు ఉద్దండుల ఫైటింగ్… విన్నర్ ఎవరో…!
TeluguStop.com
తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఏ ఎన్నికలు జరిగినా కూడా వార్ వన్‌సైడ్ అయిపోతూ వస్తోంది.
కారు జోరుకు ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ కూడా బ్రేకులు వేసే పరిస్థితి లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతోన్న ఓ ఎమ్మెల్సీ ఎన్నిక తెలంగాణ రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తికరంగా మారింది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార టీఆర్ఎస్ సైతం వెనుకడుగు వేస్తుండడం ఓ ట్విస్ట్ అయితే.
ఇద్దరు ఉద్దండులు అయిన మేథావులు పోటీ పడడం మరో ఎత్తు.టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కొదండ రాం తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో కష్టపడ్డారు.
ఆ తర్వాత కేసీఆర్‌తో ఆయనకు తేడా రావడంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన తెలంగాణ జనసమితి పార్టీ పెట్టి కాంగ్రెస్‌తో కలసి ఎన్నికల్లో పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో కోదండరాం జనగామ నుంచి పోటీ చేస్తారనుకున్నా చేయలేదు.ఆ తర్వాత మళ్లీ కోదండ రాం పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
చట్టసభల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోదండరాం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఆయనకు సరైన ఛాన్స్ ఎప్పుడూ రాలేదు.