బాలకృష్ణ , వెంకటేష్ మధ్య జరిగిన పోటీ గురించి తెలిస్తే అస్సలు నమ్మరు..ఇంత యుద్దమా..?
TeluguStop.com
హీరోలు, వాళ్ళు నటించిన సినిమాల మధ్య పోటీ అనేది ఎప్పుడూ కామన్ గానే ఉంటుంది.
ఆ పోటీకి తగ్గట్టే ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు రిలీజవుతుంటాయి.కొన్ని సినిమాలు అయితే ఒకరోజు తర్వాత మరొకటి రిలీజావుతుంటాయి.
ఆ పోటీ ఆరోగ్యకరమైనదిగా హీరోలు భావించినా, అభిమానులు మాత్రం ప్రతిష్టగా తీసుకుంటారు.దానికి తగ్గట్టే హీరోల సినిమాలు కూడా చాలా సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి.
ఈ పోటీ ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ల మధ్య, అలానే చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఉండేది.
చిరు, బాలయ్యల సినిమాల మధ్య జరిగిన బాక్సాఫీస్ వార్ మరే హీరోల సినిమాల మధ్య జరగలేదు.
జరిగినా పెద్దగా బయటకు రాలేదు.కానీ బాలకృష్ణతో చిరంజీవి సినిమాలే కాకుండా, విక్టరీ వెంకటేష్ సినిమాలు కూడా గట్టి పోటీ ఇచ్చాయని మీకు తెలుసా?
1986 ఆగస్ట్ 7 న బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడు సినిమా రిలీజైతే, ఆగస్ట్ 14 న వెంకటేష్ నటించిన కలియుగ పాండవులు సినిమా రిలీజైంది.
అయితే ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి.అలానే 1987 మే 8 న వెంకటేష్ నటించిన అజేయుడు రిలీజ్ కాగా, మే 12 న బాలకృష్ణ నటించిన ప్రెసిడెంట్ గారి అబ్బాయి సినిమా రిలీజైంది.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.అదే ఏడాది జూన్ 19 న బాలకృష్ణ హీరోగా నటించిన మువ్వ గోపాలుడు మూవీ హిట్ కాగా, జూన్ 19 న వెంకటేష్ హీరోగా వచ్చిన భారతంలో అర్జునుడు మూవీ ఫ్లాప్ గా నిలిచింది.
ఇక 1988 జనవరి 14 న వెంకటేష్ నటించిన రక్తతిలకం, ఒకరోజు గ్యాప్ తర్వాత బాలకృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ మూవీలు రెండూ ఫ్లాప్స్ గా నిలిచాయి.
"""/"/
1989 వ సంవత్సరంలో జూన్ 26 న వెంకటేష్ హీరోగా థృవ నక్షత్రం, జూన్ 29 న బాలకృష్ణ హీరోగా అశోక చక్రవర్తి సినిమాలు రిలీజయ్యాయి.
ఈ రెండు సినిమాలు హిట్ గా నిలిచాయి.అయితే ఈ రెండు సినిమాలు ఒకే కథని పోలి ఉండడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది.
1990 ఏప్రిల్ 17 న వెంకీ అగ్గిరాముడు సినిమా రిలీజవ్వగా ఫ్లాప్ అయ్యింది.
ఏప్రిల్ 25 న బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది.
1991 జూలై 12 న వెంకటేష్ హీరోగా రిలీజైన కూలీ నంబర్ వన్, అదే నెలలో 18 న బాలయ్య హీరోగా రిలీజైన ఆదిత్య 369 రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
1994 సెప్టెంబర్ 23 న బాలయ్య బొబ్బిలి సింహం హిట్ కాగా, అక్టోబర్ 1 న రిలీజైన వెంకీ మూవీ ముద్దుల ప్రియుడు ఫ్లాప్ గా నిలిచింది.
1996 జనవరి 5 న రిలీజైన బాలకృష్ణ వంశానికొక్కడు, జనవరి 13 న రిలీజైన వెంకీ ధర్మచక్రం సినిమాలు హిట్ గా నిలిచాయి.
అదే ఇయర్ లో మే 19 న రిలీజైన బాలయ్య శ్రీకృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కాగా, మే 22 న రిలీజైన వెంకీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లోప్రియురాలు సూపర్ హిట్ గా నిలిచింది.
1997 జనవరి 10 న వచ్చిన వెంకీ చిన్నబ్బాయి ఫ్లాప్ కాగా, జనవరి 11 న బాలకృష్ణ హీరోగా రిలీజైన పెద్దన్నయ్య మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
అదే ఏడాది అక్టోబర్ 9 న వెంకటేష్ పెళ్లి చేసుకుందాం రిలీజై సూపర్ హిట్ అవ్వగా, అక్టోబర్ 23 న బాలకృష్ణ హీరోగా దేవుడు మూవీ రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
"""/"/ 2000 వ సంవత్సరంలో జనవరి 14 న బాలకృష్ణ హీరోగా వంశోద్ధారకుడు రిలీజై ఫ్లాప్ అవ్వగా, ఆదేరోజు రిలీజైన వెంకీ కలుసుందాం రా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
2001 వ సంవత్సరం జనవరి 11 న నరసింహనాయుడు రిలీజై ఇండస్ట్రీ హిట్ కొట్టగా, జనవరి 15 న వెంకీ నటించిన దేవిపుత్రుడు ఫ్లాప్ గా నిలిచింది.
ఆ తర్వాత వీరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడలేదు.కానీ వెంకటేష్, యంగ్ హీరోలతో కలిసి నటించిన సినిమాలు మాత్రం బాలకృష్ణ సోలోగా నటించిన సినిమాలతో పోటీ పడ్డాయి.
వాటిలో ఎఫ్2 ఒకటి, వెంకీమామ మరొకటి.2019 జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజైతే, వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేష్ నటించిన ఎఫ్2 సినిమా జనవరి 12 న రిలీజైంది.
ఈ రెండు సినిమాల్లో కథానాయకుడు ఫ్లాప్ అవ్వగా, ఎఫ్2 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక అదే ఏడాది డిసెంబర్ 13 న వెంకటేష్, నాగచైతన్యల వెంకీ మామ హిట్ అవ్వగా, డిసెంబర్ 20 న రిలీజైన బాలయ్య రూలర్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది.
ఈ విధంగా మనకి తెలియకుండానే బాలయ్య, వెంకీల మధ్య పెద్ద బాక్సాఫీస్ వారే నడిచింది.
నాగచైతన్య శోభిత పెళ్లి పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు.. అంతా వాళ్ళ ఇష్టమే అంటూ?