దేవీశ్రీప్రసాద్, థమన్ మధ్య వెరీ టఫ్ ఫైట్.. మధ్యలో మిగతా వారి సంగతి అంతే..!
TeluguStop.com
టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా ఎస్.ఎస్.
థమన్, దేవీ శ్రీప్రసాద్ సత్తా చాటుతున్నారు.క్రేజీ ప్రాజెక్ట్స్‌కు మ్యూజిక్ అందిస్తూ ముందుకు సాగుతున్నారు.
అయితే, టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్స్, మేకర్స్ అందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా వీరిరువురే ఉంటున్నారని టాక్ వినబడుతోంది.
వీరి చేయి పడితే చాలు సినిమా హిట్ గ్యారంటీ అనే చర్చ నడుస్తోంది.
"""/"/
ప్రజెంట్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంగీతం అందిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి మొదలుకుని యంగ్ హీరోల వరకు అందరికీ సంగీతం అందిస్తున్నారు.
స్టార్ హీరోలకు ఒక్కొక్కరికి ఒక్కోలాగా సంగీతం అందిస్తూ అందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిపోయారు.
తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే అయితే దేవీ శ్రీప్రసాద్ లేదా థమన్ అనేంతలా వీరు ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.
సినిమా సక్సెస్ అనేది మ్యూజిక్ మీద ఆధారపడి ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కాగా, అటువంటి మ్యూజిక్ అందించే బాధ్యతను సరైన మ్యూజిక్ డైరెక్టర్‌కే ఇవ్వాలనే మేకర్స్ ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలోనే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా ఉన్న వారికే చాన్స్ ఇస్తున్నారు.దశాబ్ద కాలం నుంచి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సత్తా చాటుతుండగా, ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత థమన్ దశ మారిపోయిందని చెప్పొచ్చు.
అయితే, కాపీ ట్యూన్స్ చేస్తుంటాడు థమన్ అనే విమర్శలు వస్తున్నప్పటికీ తాను తగ్గేదేలా అనేలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు థమన్.
థమన్ ప్రజెంట్ మెగా పవర్ స్టార్ ‘గాడ్ ఫాదర్’ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’, జీనియర్ డైరెక్టర్ శంకర్-రామ్ చరణ్ కాంబో మూవీ, సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారిపాట’ చిత్రంతో పాటు పలు చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక దేవీ శ్రీప్రసాద్ సైతం క్రేజీ ప్రాజెక్ట్స్‌కు మ్యూజిక్ ఇస్తున్నాడు.‘పుష్ప, భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాలతో పాటు పలు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.
అయితే, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండగా, మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరికీ స్పేస్ దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాని తేజ సజ్జ లకు సక్సెస్ లు వస్తున్నాయి…మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలకు మాత్రం ఎందుకు ప్లాప్ లు వస్తున్నాయి…