Savitri Vs Bhanumathi : ఉత్తమ నటి అవార్డు రేసులో ఆ టాప్ హీరోయిన్ల మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..?
TeluguStop.com
భారతదేశంలో అనేక రకాల చిత్ర పరిశ్రమలు ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఒక్కొక్క చిత్ర పరిశ్రమలో పరిస్థితి ఒక్కోరకంగా ముందుకు సాగుతూ ఉంటుంది.
సినిమా ఇండస్ట్రీలలో( Film Industry ) సినిమాల మధ్య ఎంత పోటీ అయితే ఉంటుందో అలాగే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా సినిమాలకు వచ్చే అవార్డుల విషయంలో కూడా అలాంటి పోటీనే ఉంటుంది.
అందులో ముఖ్యంగా హీరోలకు సంబంధించిన అవార్డుల విషయంలో మాత్రం ఈ పరిస్థితి మరి ప్రెస్టేజ్ ఇష్యూ గా మారుతుంది.
దీనికి కారణం అభిమానులు వాళ్ళ అభిమాని హీరో అందరి హీరోలను బీట్ చేసి మరి బెస్ట్ హీరో అవార్డు వచ్చిందని చెప్పుకోవడానికి సంథింగ్ స్పెషల్ ఫీల్ అవుతూ ఉంటారు.
అయితే కొన్ని సందర్భాలలో అవార్డుల విషయంలో చాలా గొడవలు రావడం సహజంగా మనం గమనిస్తూనే ఉంటాం.
"""/"/ ఇకపోతే గత సంవత్సరం నేషనల్ అవార్డులు( National Awards ) ప్రకటించిన సమయంలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో మిగతా చిత్ర పరిశ్రమలకు సంబంధించిన హీరోలు కాస్త అసంతృప్తిని తెలిపిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే కాదు చాలాసార్లు అవార్డుల విషయంలో గొడవలు జరిగాయి.
ఇలాంటిదే 1950లో మద్రాసులో మద్రాస్ ఫీలిం ఫ్యాన్స్ అసోసియేషన్( Madras Film Fans Association ) అనే పేరుతో ఓ సంఘం ఉండేది.
ఈ సంఘం ప్రతి సంవత్సరం అవార్డులను ప్రధానం చేస్తూ ఉండేది.ఇందులో భాగంగానే 1953వ సంవత్సరంలో తెలుగు భాషకు సంబంధించి అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) నటించిన దేవదాసు సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయనకి బెస్ట్ హీరో అవార్డు దక్కింది.
అలాగే ఉత్తమ నటిగా చండీరాణి సినిమాలో నటించిన భాగంగా భానుమతి( Bhanumathi )కి అవార్డు ప్రధానం చేశారు.
అయితే దేవదాసు సినిమాకు సంబంధించి తమిళంలో ఈ సినిమా రీమేక్ చేయడంలో హీరోయిన్ గా సావిత్రిని ఎంపిక చేసుకున్నారు.
"""/"/
ఈ పాత్రకు సంబంధించి ఆమెకు తమిళంలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ లభించింది.
అయితే కొందరు చండీరాణి సినిమా కొరకు తెలుగులో భానుమతికి ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడం ఏంటి? అలాగే తమిళంలో ఉత్తమ నేటిగా సావిత్రి( Best Actress Savitri )కి అవార్డు ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు.
ఒకవేళ ఇస్తే రెండు భాషల్లో కలిపి ఒకే సినిమాకి ఇవ్వాలి కదా అంటూ అనేక చర్చలు జరిగాయి.
మరికొందరైతే హీరోయిన్ సావిత్రి తమిళ సంబంధించి దేవదాస్ సినిమాలో బాగా చేసింది కాబోలు.
తెలుగు దేవదాసు( Devadasu )లో బాగా చేయలేదా అంటూ కొంతమంది చురకలాంటించారు.పరిస్థితి ఇలా ఉంటే అవార్డుల ప్రధానోత్సవం రోజున ఉత్తమ నటి అవార్డును అందుకోవడానికి సావిత్రి మాత్రమే రాగా చండీరాణి సినిమా( Chandirani Movie ) కోసం అవార్డుకు ఎన్నికైన భానుమతి హాజరు కాలేదు.
రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?