బీచ్ లో జుట్లు పీక్కున్నా తెలుగు స్టార్ హీరోయిన్స్.. మాములు రచ్చ కాదు
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో చాల చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి.బయటకు మంచి స్నేహితులుగా కనిపిస్తున్న సరే లోలోపల ఎవరి ఈగో వారికి ఉండే ఉంటుంది.
అందులో అలనాటి రోజుల్లో మల్టి స్టార్రర్ సినిమాలు ఎక్కువ.ఇప్పుడు అంటే ఒక హీరోయిన్ తో వేగడానికి దర్శక నిర్మాతలకు తడిసి మోపెడవుతుంది.
కానీ అప్పట్లో ఆలా కాదు.ఎంత ఈగో ఉన్న కూడా సినిమా పైన ఆసక్తి, పెద్దలపై ఉన్న గౌరవం తో సెట్లో ఆలా జాగ్రత్తగా మైంటైన్ చేసేవారు.
అయినా కూడా కొన్ని సంఘటనలు తారాస్థాయిలో జరిగినప్పుడు మీడియాలో వాటి హడావిడి కనిపించేది.
ఇప్పట్లో లాగ సోషల్ మీడియా అప్పుడు లేకపోయినా వచ్చిన ప్రతి న్యూస్ ని బాగా ఆస్వాదించేవారు పాఠకులు.
అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన ఒక ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య జరిగింది.
వారు మరెవరో కాదు జయ సుధ, జయ చిత్ర.కటకటాల రుద్రయ్య సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్ కలిసి నటించారు.
ఈ సినిమాలో కృష్ణం రాజు సరసన జయసుధ నటించాల్సి రావడం తో అయన బాగా హైట్ ఉండటం తో జయసుధ ఒక నాలుగైదు ఇంచుల హై హీల్ వేసుకొని సెట్ కి వచ్చిందట.
అయితే ఈ సినిమాలో జయచిత్ర కూడా ఉండటం తో ఆమె గురించి తెలిసిందేగా, చాల డామినేట్ చేయడం ఆమెకు మొదటి నుంచి అలవాటు.
జయసుధ తన కన్నా ఎక్కడ అందంగా కనిపిస్తుందో అనే భయం తో డైరెక్టర్ దాసరి కి చెప్పి జయసుధ చెప్పులు విప్పమని గొడవ చేసిందట.
అయితే అందుకు జయ సుధ ఒప్పుకోలేదు. """/"/
ఇక క్లైమాక్స్ సీన్ లో బీచ్ లో ఇద్దరు కొట్టుకునే సీన్ కూడా ఉంటుందట.
దాంతో కెమెరా అన్ చేసి ఇద్దరినీ బాగా కొట్టుకొమ్మని చెప్పారట.కానీ అప్పటికే ఈ ఇద్దరి మధ్య గొడవ ఉన్న విషయం బయటకు తెలియడం తో బీచ్ లో కొట్టుకునే సీన్ కి లింక్ పెట్టి జయ సుధ మరియు జయ చిత్ర సినిమా సీన్ కాకుండా నిజంగా నే కొట్టుకున్నారంటూ న్యూస్ బాగా వైరల్ అయ్యింది.
అది అందరు నిజమని కూడా అనుకున్నారు.అయితే జయ సుధ అప్పట్లో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి చెప్పి నవ్వుకున్నారు.
చెప్పుల గొడవ నిజమే కానీ బీచ్ గొడవ అబద్దం అంటూ చెప్పారు.
మూడు నెలలు అరటిపండు తిని మజ్జిగ తాగి జీవించానన్న రాజేంద్ర ప్రసాద్.. అన్ని కష్టాలు పడ్డారా?