రెండు పెద్ద పులుల న‌డుమ భీక‌ర పోరు.. వీడియో వైర‌ల్‌

అడ‌విలో పులి గ‌ర్జ‌నదే పై చేయి.ఆ గ‌ర్జ‌న విన‌ బ‌డితేనే సాధు జంతువులు ప్రాణాలు అర‌ చేతిలో పెట్టుకుని ప‌రుగెత్తుతాయి.

అందుకే మ‌నుషుల‌ను పోల్చాల్సి వ‌స్తే పులి లాంటి వ్య‌క్తి అని అంటారు.పులికి ఎదురెలితే చావుకు ఎదురెళ్లిన‌ట్టే అని సినిమాల్లో ఎన్ని డైలాగులు విన‌లేదండి.

మ‌రి అడ‌విలో పులి వేట అంటే మామూలుగా ఉంటుందా.దాని కంట్లో ప‌డ్డ ఏ జంతువు అయినా దానికి ఆహారం కావాల్సిందే.

అందుకే అడ‌విలో వేట‌కు సంబంధించిన వీడియోల‌కు అంత‌లా క్రేజ్ ఉంటుంది.వాటికి విప‌రీత‌మైన వ్యూస్ కూడా వ‌స్తుంటాయి.

మొన్న‌టికి మొన్న ఓ పెద్ద పులి జింకను వేటాడిన వీడియో ఎంత‌లా వైర‌ల్ అయిందో అంద‌రికీ తెలిసిందే.

అయితే ఒక పులికి మ‌రో పులి ఎద‌రు ప‌డితే ఇంకేమైనా ఉందా.ప్రాంతం కోసం పంతం నెగ్గించు కునేందుకు ఎంత‌లా పోరాడుతాయో అంద‌రికీ తెలిసిందే.

ఒకే జాతికి చెందిన సాధు జంతువులు క‌లిసి ఉంటాయేమో గానీ.క్రూర జంతువులు మాత్రం అస్స‌లు క‌లిసి ఉండ‌వు.

ఆ ఏరియా మీద త‌మ పెత్త‌నం కోసం అక్క‌డ‌కు ఎవ‌రు వ‌చ్చినా స‌రే విప‌రీతంగా పోరాడి త‌న్ని త‌రిమేస్తుంటాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి బాగా పాపుల‌ర్ అవుతోంది.దాన్ని చూస్తే మీరు కూడా వావ్ అన‌క ఉండ‌లేరేమో.

ఎందుకంటే మ‌నుషుల‌కు జంతువుల పోరు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది క‌దా.అయితే ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో రెండు పులులు ఒక‌దానికి మ‌రొక‌టి ఎదురు ప‌డ్డాయి.

ఇంకే ముంది ఒక‌దాన్ని మ‌రొక‌టి పైచేయి సాధించేందుకు భీక‌ర పోరును సాగించాయి.ప్రాణాలు పోయేలా దాడి చేసుకుంటున్నాయి.

ఇందుకు సంబంధించిన ఘ‌ట‌న‌ను మొత్తం ఒక‌రు రికార్డు చేసి నెట్టింట్లో పోస్టు చేశారు.

ఇంకేముంది దాన్ని చూసిన వారంతా కూడా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.