కాంగ్రెస్ టికెట్ల కు తీవ్ర పోటీ ! ఢిల్లీ బాటలో ఆశావాహులు ?
TeluguStop.com
తెలంగాణలో త్వరలో జరగబోతున్న అసెంబ్లీ టికెట్ల కేటాయింపు వ్యవహారం అన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది.
ఇప్పటికే బీఆర్ఎస్( BRS Party ) తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించింది.
ఆ ప్రయత్నం తర్వాత టికెట్ దక్కిన వారు నిరాశ కు గురవడం, పార్టీ మారడం, పార్టీపై విమర్శలు చేయడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.
ఇక తెలంగాణ కాంగ్రెస్ లోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపించబోతోంది.ఇప్పటికే అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న వారి నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించింది.
నిన్నటితో ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది.చాలామంది నేతలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ దరఖాస్తులన్నిటిని కరుణాకరన్ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి అభ్యర్థులను ఫైనల్ చేయనుంది.
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి విడత జాబితా విడుదల చేసేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటుంది.
"""/" /
ప్రస్తుతం వచ్చిన అన్ని దరఖాస్తులను టి పిసిసి స్క్రీనింగ్ కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీలు పూర్తిగా పరిశీలించి జిల్లా కాంగ్రెస్( Congress Party ) కమిటీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని రెండు రోజుల్లో సిడబ్ల్యుసి, పార్టీ కేంద్ర ఎన్నికల పరిశీలన కమిటీకి పంపించబోతున్నారు.
ఈసారి బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతూ ఉండడం తో దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థులని పోటీకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది .
అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకోబోతోంది.మరో వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండడంతో, కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు అప్పుడే ఢిల్లీ బాట పట్టారు.
దరఖాస్తుల ప్రక్రియ ముగిసే వరకు హైదరాబాదులోనే మకాం వేసిన అనేకమంది నేతలు ఇప్పుడు ఢిల్లీ బాట పట్టారు .
తమ పలుకుబడిని ఉపయోగించి ఏఐసిసి పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.</br """/" /
కొంతమంది డిసిసి నేతలను , మరికొంతమంది పిసిసి పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రకటించబోయే జాబితాలో తమ పేరు ఉండే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో, వారికి దీటైన వారిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబుతాను పూర్తిగా పరిశీలించి అన్ని విధాలుగా బలమైన నేతలకే టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట.
మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?