హుజూరాబాద్ పాలిటిక్స్ : బస్తీమే సవాల్ అంటున్న నాయకులు !

అసలు ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీల మధ్య యుద్ధం వచ్చేసినట్లుగా పరిస్థితి మారిపోతుంది.

ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ, జనాల్లో తమ పార్టీ గొప్పతనాన్ని చాటి చెప్పుకునేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుంది.

ప్రజల్లో తమ ప్రత్యర్థులకు క్రెడిట్ రాకుండా ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రతి పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుంది .

ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది ముఖ్యంగా బిజెపి, టిఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి.

ఒకరిపై మరొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ తామే గొప్ప అన్న ఫీలింగ్ జనాల్లో కల్పించే విధంగా అన్ని పార్టీలు , ఆ పార్టీలకు చెందిన నాయకులు ప్రయత్నిస్తూనే వస్తున్నారు.

ఒక పార్టీ నాయకులు చేసిన విమర్శలకు మరో పార్టీ నాయకులు ఘాటుగా సమాధానం ఇస్తూ హుజురాబాద్ రాజకీయాలు మరింత వేడెక్కించే పనిలో నిమగ్నమయ్యారు.

పోలింగ్ తేదీకి ఇంకా వారం మాత్రమే సమయం ఉండడంతో, తమ విమర్శల డోసును మరింతగా పెంచారు.

ముఖ్యంగా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ , తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తదితర నాయకులు కొన్ని కొన్ని విషయాలలో తనతో చర్చకు రావాలంటూ టీఆర్ఎస్ కీలక నాయకులకు సవాళ్లు విసురుతున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో తనతో పాటు పోటీ చేసేందుకు దమ్ముంటే సీఎం కేసీఆర్ , మంత్రి హరీష్ రావు రావాలంటూ బిజెపి హుజురాబాద్ అభ్యర్థి ఈటెల రాజేందర్ సవాల్ చేశారు.

"""/"/ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేయలేక పోయారని మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలపై ఈటెల రాజేందర్ స్పందించారు.

దీనిపై బహిరంగ చర్చకు రావాలి అంటూ ఆయన సవాల్ చేశారు.అలాగే హుజురాబాద్ అభివృద్ధి విషయంలోనూ అంబేద్కర్ చౌరస్తాలో తనతో చర్చకు రావాలని రాజేందర్ డిమాండ్ చేశారు.

దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని బీజేపీ ఈసీకి ఎటువంటి లేఖ రాయలేదని,  దీనిని నిరూపించేందుకు తడి గుడ్డ కట్టుకుని తాను చెల్పూర్ పోచమ్మ గుడి కి వస్తానని, సీఎం కేసీఆర్ వస్తాడా అంటూ ఈటెల రాజేందర్ సవాల్ చేశారు.

అంతేకాదు దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలంటూ ఈటెల రాసినట్లుగా వైరల్ ఆవుతున్న లేఖ పైనా స్పందించారు.

తాను అటువంటి లేఖ రాయలేదని, ఫేక్ లెటర్ సృష్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు.ఈ లేఖ రాసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనంటూ  వ్యాఖ్యానించారు.

దళిత బంధు పథకాన్ని ఆపాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లేఖలు రాశారని విషయంపైన ఆయన స్పందించారు.

కేసీఆర్ కు సవాల్ విసిరారు.దీనిని నిరూపించేందుకు యాదాద్రి లక్ష్మీ నరసింహ గుడి కి రావాలని డిమాండ్ చేశారు.

ఈ విధంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో సవాళ్లు ప్రతిసవాళ్ల తో రాజకీయ వాతావరణం రోజు రోజుకు మరింత వేడెక్కుతోంది.

నారా భువనేశ్వరి పై డిప్యూటీ సీఎం కొట్టు ఫైర్