ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కోసం స్థల పరిశీలన.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లోని పెద్దబడి వద్ద ప్రమాదకరం గా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కోసం స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్( Oggu Rajitha Yadav ) గురువారం సాయంత్రం పరిశీలించారు.

పెద్ద బడి కి ఆనుకుని ఉన్న ట్రాన్స్ పార్మర్ ద్వారా అక్కడ ఉన్న ఇండ్లకు విద్యుత్ సరఫరా అవుతుంది.

కాగా ఇటీవల హై ఓల్టేజ్ విద్యుత్ సప్లయ్ కావడంతో పలువురి ఇండ్లలో గల టివి లు,ఫ్యాన్ లు, కులార్ లు,ఫ్రిడ్జ్ లు కాలిపోయి భారీగా నష్టం వాటిల్లింది.

ఇట్టి విషయం తెలుసుకున్న స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ఇట్టి విషయం స్థానిక సెస్ ఏ ఈ దివ్య కు తెలపగా ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కోసం అంచనాలు తయారుచేయించారు.

తిరిగి బుదవారం రాత్రి మళ్ళీ ఆ ఏరియా లో నివాసం ఉంటున్న వారి ఇండ్లలో గల టివి లు , కూలర్ లు ఫ్రిడ్జ్ లు కాలిపోయాయి.

వెంటనే యుద్ధప్రాతపదికన ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయాలని సెస్ ఏ.ఈ దివ్య దృష్టికి తీసుకెళ్లగా యుద్ధప్రాతిపదిక ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేస్తామని సెస్ ఏ.

ఈ దివ్య తెలిపారు.ఉపసర్పంచ్ వెంట వార్డ్ మెంబర్ దేవేందర్ ఉన్నారు.

భారతదేశంలో కొరియన్ యూట్యూబర్ అపహరణ.. చివరికి ఏమైందో తెలిస్తే..?