ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్… ఏపీఓ, టీఏఆర్ కు షోకాజ్ నోటీసులు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలంలోని మంచ్యాతండా గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ మాలోతు రవిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తేజస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మఠంపల్లి ఏపీఓ ఉమాదేవి,
టీఏఆర్ నరసింహకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.మంచ్యాతండాలో ఉపాధి హామీ పనుల్లో ఫోఅవినీతి, అక్రమాలు జరిగాయని, ఫోర్జరీ సంతకం ద్వారా డబ్బులు డ్రా చేశారని స్థానికంగా వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.
అనంతరం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.