అంతా నా ఇష్టం అంటున్న ఫీల్డ్ అసిస్టెంట్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: జిల్లాలోని చివ్వేంల మండలం బి.చందుపట్ల గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ శుక్రవారం 300 మంది ఉపాధి కూలీలను పనికిరావద్దని వెనక్కి పంపించడంతో ఉపాధి కూలీలు అవాక్కయ్యారు.
ఇదేంటని గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ రవి ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తే నా ఇష్టం,ఏమైనా చేస్తా,నా ఇష్టం వచ్చినట్టు చేస్తా,ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండని దురుసుగా ప్రవర్తించడంతో కూలీలు అతని ఇంటి ముందు బైఠాయించారు.
దీనితో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనడంతో గ్రామ కార్యదర్శి జోక్యం చేసుకుని తిరిగి పనులకు పంపించడంతో ఘర్షణ సద్దుమణిగింది.
ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ ఓకే రోజు 300 మంది కూలీలను పని వద్దని వెనక్కి పంపించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పనికిరాకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మస్టర్ వేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడని ఆరోపించారు.
ఏదైనా అడిగితే సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించే సదరు ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
లవ్ యూ బేబీ అంటూ లావణ్యపై ప్రేమను చాటుకున్న వరుణ్.. ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!