మెరిసే చర్మం కోసం మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
TeluguStop.com

మెంతులు.ఇవి తెలియని వారు ఉండరు.


అందరి వంటింట్లో ఉండే మెంతులను.అనేక వంటల్లో ఉపయోగిస్తారు.


పచ్చళ్లలో, చారు, పులుసు వంటి వంటల్లో ఖచ్చితంగా మెంతులు ఉండాల్సిందే.విటమిన్ సి, బి1, బి2, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్న మెంతులు.
చెడు కొలెస్టరాల్ తగ్గించడం, మధుమేహం అదుపులో ఉంచడం, గుండె జబ్బులను నివారించడంలో గ్రేట్‌గా సహయపడతాయి.
ఇక చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ మెంతులు ఉపయోగపడతాయి.మరి మెంతులు చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక స్పూన్ మెంతులను నీటిలో నాలుగు గంటలు నానబెట్టి.అనంతరం పేస్ట్‌గా రుబ్బుకోవాలి.
ఈ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి.ముఖానికి, మెడకు అప్లై చేయాలి.
పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
మరియు ముఖంలో కొత్త కాంతి సంతరించుకుంటుంది.అలాగే కొన్ని మెంతులను తీసుకుని.
డ్రై రోస్ట్ చేసి పౌడర్ పట్టుకోవాలి.ఈ పౌడర్‌లో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా, కోమలంగా మారుతుంది.మరియు ముఖంపై ఉన్న మృతకణాలు కూడా తొలగిపోతాయి.
మెంతులను చర్మం ప్రకాశవంతంగా మరియు తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.మెంతులను పౌడర్ చేసి.
అందులో కొద్దిగా పసుపు మరియు గోరువెచ్చని నీరు పోసి.ముఖానికి పట్టించాలి.
పావు గంట సేపు ఆరనిచ్చి.అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారినికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?