చుండ్రును త‌రిమికొట్టే మెంతికూర‌..ఎలాగంటే?

చుండ్రు కోట్లాది మందిని బాధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.ఒక్క సారి ప‌ట్టుకుందంటే చుండ్రు అస్స‌లు వ‌దిలి పెట్ట‌దు.

దాంతో దీనిని వ‌దిలించుకునేందుకు ర‌క‌ర‌కాల హెయిర్ ఆయిల్స్‌, ఖ‌రీదైన షాంపూల‌ను యూజ్ చేస్తుంటారు.

అలాగే మార్కెట్‌లో దొరికే ఎన్నెన్నో హెయిర్ ప్యాకుల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.కొంద‌రైతే ఏవో ట్రీట్‌మెంట్స్ సైతం చేయించుకుంటారు.

కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే మెంతికూర‌తో చాలా అంటే చాలా సుల‌భంగా చుండ్రును వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు అదెలాగో ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక మెంతికూర క‌ట్ట తీసుకుని నీటిలో క‌డిగి.

ఆపై మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో నాలుగు స్పూన్ల మెంతికూర పేస్ట్, రెండు స్పూన్ల హెన్నా పొడి, ఒక స్పూన్ పెరుగు, రెండు స్పూన్ల నిమ్మ ర‌సం, ఒక స్పూన్ ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌లకు ప‌ట్టించి.గంట పాటు ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

ఆపై కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ‌నుక చుండ్రు స‌మ‌స్య‌ ప‌రార్ అవ్వ‌డ‌మే కాదు జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది.

"""/" / అలాగే మెంతికూర ఆకుల‌ను ఎండ బెట్టుకుని మెత్త‌గా పొడి చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల మెంతికూర ఆకుల పొడి, ఒక స్పూన్ ఉసిరి కాయ పొడి, ఒక స్పూన్ వేప ఆకుల పొడి మ‌రియు వాట‌ర్ వేసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు త‌ల‌కు రెగ్యుల‌ర్ ఆయిల్‌ను అప్లై చేసి.ఆపై త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ప‌ట్టించాలి.

న‌ల‌బై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.నాలుగు రోజుల‌కు ఒక సారి ఇలా చేసినా కూడా చుండ్రు స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.

ఎన్నికల సరళిపై ముకేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..!!