కంటి చూపును మెరుగుప‌రిచే సోంపు..ఎలా వాడాలంటే?

నేటి కాలంలో చాలా మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు.చిన్న వ‌య‌సులో కంటి చూపు లోపిస్తుండ‌డం అనేది ఎక్కువ శాతం మందిలో కామ‌న్‌గా క‌నిపించే స‌మ‌స్య.

అయితే కంటి చూపును మెరుగు ప‌ర‌చ‌డంలో సోంపు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.సోంపు గింజ‌ల‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

సోంపును సాధారణంగా తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణించుకునేందుకు, నోటి దుర్వాస‌న‌ను దూరం చేసుకునేందుకు వాడుతుంటారు.

అయితే సోంపుతో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.సోంపు గింజ‌ల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా పోష‌కాలే నిండి ఉన్నాయి.

అటువంటి సోంపు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.సోంపులో పుష్క‌లంగా ఉండే విటమిన్ ఎ, అనెథోల్ సమ్మేళనం కంటి చూపును మెరుగుపరుస్తుంది.

మ‌రియు క‌ళ్లు నీరు కార‌డం, క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌టం వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తుంది.

"""/" / మ‌రి సోంపును ఎలా తీసుకోవాలి అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.

అక్క‌డికే వ‌స్తున్నా.ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి.

ఇలా మ‌రిగిన నీటిలో వడబోసి గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి.ఈ సోంపు వాట‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగు ప‌డ‌డంతో పాటుగా శ‌రీరంలో కొవ్వును క‌రిగించి అధిక బ‌రువు దూరం చేస్తుంది.

అలాగే ఈ సోంపు వాట‌ర్ రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే.త‌ల‌నొప్పి, ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను కూడా క‌రుగుతుంది సోంపు.దాంతో గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

కాబ‌ట్టి, కంటి స‌మ‌స్య‌లు ఉన్న వారే కాదు అంద‌రూ సోంపును తీసుకోవ‌చ్చు.

చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. గేమ్ ఛేంజర్ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అంటూ?