నల్లని పాదాలు తెల్లగా మారాలంటే...అద్భుతమైన ఇంటి చిట్కాలు
TeluguStop.com
అందం విషయంలో చాలా మంది ముఖానికి ఇచ్చినంత ప్రాధాన్యత పాదాలకు ఇవ్వరు.దాంతో పాదాలు నల్లగా అందవిహీనంగా మారతాయి.
అయితే ఇంటిలోనే కాస్త శ్రద్ద
పెడితే తెల్లని అందమైన పాదాలను సొంతం చేసుకోవచ్చు.అయితే కొన్ని పాక్స్
తయారుచేసుకోవాలి.
వాటిని తయారుచేసుకోవడం చాలా సులువు.ఇపుడు వాటి గురించి
వివరంగా తెలుసుకుందాం.
నిమ్మకాయలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన నిమ్మరసంను పాదాలకు రాసి
5 నిమిషాల పాటు మసాజ్ చేసి చల్లని నీటితో శుభ్రం చేయాలి.
ఈ విధంగా రోజు
చేస్తూ ఉంటే వారంలో రోజుల్లో నల్లని పాదాలు తెల్లగా మారతాయి.
ఒక స్పూన్ శెనగపిండిలో చిటికెడు పసుపు,అరస్పూన్ పెరుగు, నిమ్మరసం వేసి
మెత్తని పేస్ట్ లా తయారు చేయాలి.
ఈ పేస్ట్ ని పాదాలకు పట్టించి 20
నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసి మరుసటి
రోజు ఉదయం పాదాలను శుభ్రం చేసుకోవాలి.
ఒక స్పూన్ పాలపొడిలో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి పాదాలకు రాసి అరగంట
తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా చేయటం వలన పాదాలపై
పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.ఒక స్పూన్ ఎండిన ఆరెంజ్ తొక్కల పొడిలో అరస్పూన్ ముల్టానా మట్టి వేసి
నీటితో మెత్తని పేస్ట్ గా చేయాలి.
ఈ పేస్ట్ పాదాలకు రాసి ఆరాక చల్లని
నీటితో శుభ్రం చేసుకోవాలి.
నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!