ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి: వీరమళ్ల కార్తిక్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుపరచాలని మునుగోడు నియోజకవర్గ బిసి యువజన సంఘం అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ గురువారం ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా నిబంధనలను విరుద్ధంగా యూనిఫామ్,పాఠ్యపుస్తకాలు పేరుతో తల్లిదండ్రుల నుంచి వేల రూపాయల డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

సంబంధిత అధికారులు పట్టించుకోని గుర్తింపు లేని పాఠశాలను రద్దు చేయాలని కోరారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేసి,ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలన్నారు.

జర్నలిస్టుల పిల్లలకు పూర్తి రాయితితో కూడిన విద్యను అందించాలని డిమాండ్ చేశారు.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి