ఆటో కార్మికులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి:యరగాని నాగన్న గౌడ్

సూర్యాపేట జిల్లా:ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆటో ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి, నామమాత్రపు వడ్డీలతో ఫైనాన్స్ కంపెనీలు సహకారం అందించే విధంగా చూసి ఆటో కార్మికులను ఆదుకోవాలని ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం మఠంపల్లి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆటో వర్కర్స్ యూనియన్ (రిజిస్టర్ నెంబర్ 1559)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హుజూర్ నగర్-మట్టపల్లి, మఠంపల్లి ఆటో అడ్డాను మఠంపల్లి ఎస్ఐ ఇరుగు రవితో కలిసి అయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాగన్న గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల 75 వేల మంది ఆటో కార్మికులు ఆటోలు కలిగి ఉన్నారని,నిత్యం ఫైనాన్స్ ఇబ్బందులతో కుటుంబ పోషణకు కూడా సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవిత భద్రత కూడా దూరమవుతుందనే ఆందోళనకు కార్మికులు గురవుతున్నారన్నారు.కార్మికుల కుటుంబాలకు రక్షణగా నిలుస్తూ సాధారణ మరణానికి కూడా రూ.

5 లక్షల బీమాను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.ఎస్సై ఇరుగు రవి మాట్లాడుతూ ఆటో కార్మికులు క్రమశిక్షణతో తమ ఆటోలను నడపాలని, తక్కువ మందిని ఎక్కించుకొని సురక్షితంగా వెళ్ళాలని,ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా రోడ్ల ప్రక్కన నిలపాలని సూచించినారు.

ఆటో యూనియన్ అధ్యక్షులు ఎస్ కె.హుస్సేన్,ప్రధాన కార్యదర్శి రెడపంగు రాము,గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐఎన్టియూసి అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య, ప్రధాన కార్యదర్శి గుంటక కరుణాకర్ రెడ్డి, వల్లపుదాసు మహేష్, చింతకాయల రాము, పోతనబోయిన రామ్మూర్తి, కస్తాల రవీందర్,షాముల నాగిరెడ్డి,జోష్,పులి పాపయ్య,హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఓకే హీరోతో ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్స్ వీరే !