జగన్ కు భయం.. ప్రతిపక్షాల దైర్యం !
TeluguStop.com
ఏపీలో ఎన్నికలకు( AP Elections ) సరిగ్గా 10 నెలల సమయం ఉంది.
అయినప్పటికి ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.అధికార వైసీపీ( YCP ), ప్రతిపక్ష టిడిపి( TDP ) అలాగే జనసేన పార్టీ( Janasena ) మూడు కూడా ఎన్నికల వేడిని తలపించేలా వ్యూహాలు రచిస్తున్నాయి.
కాగా ఎన్నికలకు సమయం ఇంకా చాలానే ఉన్నప్పటికి ఇప్పటి నుంచే పార్టీలన్నీ ఎందుకు హడావిడి చేస్తున్నాయంటే.
దీనికి ఒకటే కారణం ముందస్తు ఎన్నికలే.ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నాయి.ఎందుకంటే వైసీపీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఓటమి భయంతో జగన్ ముందస్తు ఎన్నికలకు వెలతారనే భావనతో టీడీపీ జనసేన పార్టీలు ఉన్నాయి.
"""/" /
ఇదే విషయాన్ని అధినేతలు పలు మార్లు చెప్పుకొచ్చారు కూడా.ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu Naidu )ఇటీవల మేనిఫెస్టోను కూడా ప్రకటించడాన్ని బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలు గ్యారెంటీ అనే భావన కలుగక మానదు.
అయితే అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలను ఖండిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని తేల్చి చెబుతోంది.
అయితే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీకే నష్టం అనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.
ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలపై చాలా నియోజిక వర్గాలలో వ్యతిరేకత వినిపిస్తోంది.అలాగే జగన్ పాలనపై కూడా ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉంది.
"""/" /
ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళితే ఆ ప్రభావం ఎన్నికల్లో వైసీపీని గట్టిగా దెబ్బతీసే ఛాన్స్ లేకపోలేదు.
అందుకే వైసీపీ సర్కార్ ముందస్తు ఎన్నికల విషయంలో వెనుకడుగు వేస్తోందనేది కొందరి అభిప్రాయం.
అయితే పదే పదే ముందస్తు ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నాయి టీడీపీ, జనసేన పార్టీలు.
ఎందుకంటే ప్రస్తుతం జగన్( Jagan ) సర్కార్ పై ఉన్న వ్యతిరేకత.ఈ రెండు పార్టీలకు ప్లెస్ అవుతుందనే దైర్యంతో ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నాయి.
అయితే ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే.ఈ ఏడాది డిసెంబర్ తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
మరి ముందస్తు ఎన్నికల విషయంలో జగన్ ముందడుగు వేస్తారా? లేదా షెడ్యూల్ ప్రకారమే అని పాత పాటే పాడతారా అనేది చూడాలి.
క్షమించండి.. తప్పు చేశాను.. అలేఖ్య చిట్టి సంచలన వీడియో