భారతీయ రెస్టారెంట్‌పై దాడి.. 16 నెలలుగా న్యాయం కోసం నిరీక్షణ, రంగంలోకి ఎఫ్‌బీఐ

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు.

అంతేకాకుండా మనకు మాత్రమే సొంతమైన భారతీయ వంటకాలను విదేశీయులకు కూడా రుచిచూపిస్తున్నారు.అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ రెస్టారెంట్లు పరదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి.

మన వంటకాల రుచికి వారు కూడా వహ్వా అనాల్సిందే.అందుకే ఏ దేశంలో చూసినా మన హోటళ్లు, రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతూ వుంటాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతీయుల కంటే అక్కడి స్థానికులే ఎక్కువగా ఆ హోటళ్లకు ఎగబడుతున్నారు.

అయితే కొందరు స్థానికులు మాత్రం భారతీయులపై అక్కసు పెంచుకుంటూ మన రెస్టారెంట్లపై దాడులకు తెగబడుతున్నారు.

ఈ క్రమంలో ప్రాణాలు తీసేందుకు సైతం వారు వెనకాడటం లేదు.ఈ క్రమంలోనే అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర రాజ‌ధాని శాంటా ఫీ న‌గ‌రంలో ఉన్న ఇండియ‌న్ రెస్టారెంట్‌పై గ‌తేడాది జరిగిన దాడి తీవ్ర కలకలం రేపిన విష‌యం తెలిసిందే.

ఆ దాడిలో ఇండియా ప్యాలెస్ హోట‌ల్ పూర్తిగా ధ్వంస‌మైంది. """/"/ గుర్తు తెలియ‌ని దుండగులు గ‌తేడాది జూన్‌లో.

హోట‌ల్‌లోకి ప్ర‌వేశించి.కిచెన్‌, డైనింగ్ రూమ్‌, స్టోరేజ్ ఏరియాలను ధ్వంసం చేశారు.

ట్రంప్ 2020 అంటూ ఆ హోట‌ల్ గోడ‌ల‌పై పెయింటింగ్ కూడా వేశారు.ఆ హోట‌ల్ యజమాని ఓ సిక్కు మ‌త‌స్తుడు.

ఆ దాడి వ‌ల్ల దాదాపు సుమారు ల‌క్ష డాల‌ర్ల మేర అత‌నికి న‌ష్టం వ‌చ్చింది.

రెస్టారెంట్‌పై దాడి ఘ‌ట‌న‌ను విద్వేష ఘ‌ట‌న‌గా చూపిస్తు శాంటా ఫీ పోలీసులు కేసు నమోదు చేశారు.

2013లో బ‌ల్జీత్ సింగ్ అనే భార‌తీయ సిక్కు ఆ రెస్టారెంట్‌ను కొన్నారు.దానిని ఆయ‌న కుమారుడు బ‌ల్జోత్ న‌డిపిస్తున్నారు.

దాడి జ‌రిగి 16 నెల‌లు గ‌డుస్తున్నా.ఇంకా ఆ కేసులో ఎటువంటి ఛార్జిషీట్ లేదు.

ఈ నేపథ్యంలో ఈ కేసును అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి అప్ప‌గించారు.

రెస్టారెంట్‌ను ధ్వంసం చేయవద్దని తాను ఎంతగా ప్రాధేయపడినా వారు వినకుండా రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారని బల్జోత్ సింగ్ వాపోయారు.

జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కొత్త సెట్ వేస్తున్నారా..?