కుమారుడిని చంపి.. తప్పించుకుని తిరుగుతూ, భారత సంతతి మహిళ ఆచూకీ చెబితే భారీ రివార్డ్
TeluguStop.com
తన కుమారుడిని హత్య చేసిన భారత సంతతి మహిళను దోషిగా తేల్చడానికి కావాల్సిన ఆధారాలతో పాటు ఆమె ఆచూకీపై సమాచారం అందించిన వారికి 25,000 డాలర్ల రివార్డును ప్రకటించింది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( Federal Bureau Of Investigation )(ఎఫ్‌బీఐ).
నిందితురాలిని సిండి రోడ్రిగ్జ్ సింగ్‌గా ( Cindy Rodriguez As Singh )గుర్తించారు.
2022 అక్టోబర్‌లో తన ఆరేళ్ల కుమారుడిని హత్య చేసినట్లుగా రోడ్రిగ్జ్‌పై ( Rodriguez )అభియోగాలు ఉన్నాయి.
టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ అభ్యర్ధన మేరకు ఎవర్‌మాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు మార్చి 20, 2023న బాలుడి తరపున తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బాధిత బాలుడు తన బయోలాజికల్ తండ్రితో కలిసి మెక్సికోలో నివసిస్తున్నాడని రోడ్రిగ్జ్ అబద్ధం చెప్పింది.
నవంబర్ 2022 నుంచి చిన్నారి మెక్సికోలోనే ఉంటున్నాడని తెలిపింది. """/" /
అయితే మార్చి 22, 2023న రోడ్రిగ్జ్ సింగ్ ఆమె భర్త, మరో ఆరుగురు చిన్నారులు ఓ ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో భారత్‌కు బయల్దేరారు.
కానీ తప్పిపోయిన పిల్లవాడు మాత్రం వారితో లేడు.అక్టోబర్ 31, 2023న టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్ టారెంట్ కౌంటీలోని( Worth In Tarrant County, Texas ) డిస్ట్రిక్ట్ కోర్టులో రోడ్రిగ్జ్ సింగ్‌పై హత్యానేరం మోపారు.
నవంబర్ 2, 2023న టెక్సాస్ నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆమెపై ఫెడరల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకునేలా వ్యవహరించిందని రోడ్రిగ్జ్‌పై అభియోగాలు మోపారు. """/" /
అనంతరం రోడ్రిగ్జ్‌ను గుర్తించడంలో సహాయం చేయాలని డల్లాస్ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ ఇన్‌ఛార్జ్ మీడియాను, ప్రజలను కోరారు.
తన చిన్న కొడుకును హత్య చేసినట్లుగా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు.
రోడ్రిగ్జ్ 1989లో టెక్సాస్‌లోని డల్లాస్‌లో జన్మించింది.ఆమె 5 అడుగుల 1 అంగుళాల పొడవు, 120-140 పౌండ్ల బరువు ఉంటుందని ఎఫ్‌బీఐ తెలిపింది.
ఛామన ఛాయతో కాళ్ల వెనుకవైపు, కుడి చేతిపై టాటూలు ఉన్నాయని.గోధుమ రంగు కళ్లు, గోధుమ రంగు జుట్టు ఉందని పేర్కొంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, శుక్రవారం 2024