కరోనా ఎఫ్ఫెక్ట్...అమెరికాలో నటుడి అరెస్ట్..దూల తీరిపోయిందిగా....!!!

అసలే కరోనా తో ప్రపంచం మొత్తం అల్లాడి పోతుంటే మధ్యలో కేటుగాళ్ళు కరోనాని అడ్డుపెట్టుకుని సులువుగా కోటీశ్వరులు అయ్యిపోవాలని స్కెచ్ లు గీస్తున్నారు.

మధ్య మధ్యలో కరోనా పేరు చెప్పి ఇప్పటికే సైబర్ నేరాలు జరిగిపోతున్నాయి కూడా ఈ క్రమంలోనే అమెరికాలోని ఓ నటుడికి కరోనా తో కోట్లు సంపాదించుకోవాలని ఆశ పుట్టింది.

వెంటనే తన బుర్రకి పదును పెట్టాడు.అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియాలలో కరోనా బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు.

ఇదే అదును అనుకున్న దక్షిణ కాలిఫోర్నియాకి చెందిన కీత్ లారెన్స్ మిడిల్ బ్రూక్ కరోనా తోనే కామెడీ చేశాడు.

సహజంగా సినిమాలలో, బుల్లి తెరపై నటించే అలవాటు ఉన్న అతడు కరోనాకి మందు కనుగొన్నాము, ఈ వ్యాధి సోకకుండా ఉండటానికి అలాగే సోకిన వారికి ఇద్దరికీ ఈ మందు ఉపయోగ పడుతుందని ప్రకటించాడు.

అక్కడితో ఆగకుండా. """/"/ తనకి ఓ ఫార్మ కంపెనీ ఉందని అందులో ఈ మందుని కనిపెట్టారని, త్వరలో పంపిణీ ఉంటుందని అన్నారు.

అంతేకాదు ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే పెట్టచ్చు, లాభం గూబల్లోకి వెళ్తుంది అంటూ నమ్మబలికాడు, మరో అడుగు ముందుకు వేసి బాస్కెట్ బాల్ సూపర్ స్టార్ అయిన మ్యాజిక్ జాన్సన్ ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడని పేర్కొన్నాడు.

ఈ మందు వాడిన ఓ వ్యక్తికి కరోనా దెబ్బకి పోయిందని ప్రకటించాడు.దాంతో ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నాడని ఎఫ్బీఐ కి తెలియడంతో సదరు నటుడిని కటకటాలలోకి నెట్టి చిప్ప కూడు తినిపిస్తున్నారు అమెరికా పోలీసులు.

ఇతగాడి నేరం రుజువైతే సుమారు 20 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందట.

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి