బుధవారం వినాయకుడికి దానిమ్మ పువ్వులతో పూజిస్తే..?
TeluguStop.com
బుధవారం ఆ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు.వినాయకుడికి ప్రీతికరమైన బుధవారం రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు.
అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఆ వినాయకుడికి పత్రపూజ చేయటం వల్ల అనుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి.
అయితే వినాయకుడికి పూజ చేసేటప్పుడు 21 పత్రాలను సమర్పించాలి.వినాయకుడికి ఎంతో ఇష్టమైన సంకష్టహర చతుర్దశి, వినాయక చతుర్థి, బుధవారం ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయటం వల్ల శుభ ఫలితాలు జరుగుతాయి.
మన జీవితంలో ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోవాలంటే ముఖ్యంగా వినాయకుడికి ఈ మూడు రోజులలో ఒక రోజు 21 విష్ణు వర్ధిని పత్రాలతో వినాయకుడికి పూజ చేయటం వల్ల పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది.
అదేవిధంగా దేవదారు ఆకులతో వినాయకుడిని పూజిస్తే మనోధైర్యం చేకూరుతుంది.వినాయకుడికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి.
ఈ విధంగా వినాయకుడికి గరికతో పూజ చేయటంవల్ల ప్రీతి చెంది గర్భస్థ పెరిగే శిశువుకు రక్షణ కల్పిస్తాడు.
పుట్టబోయే బిడ్డకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం లభిస్తాయి.మనకు సకల సౌభాగ్యాలు కలగాలంటే వినాయకుడికి 21 బిల్వదళాలతో పూజ చేయాలి.
అదేవిధంగా దానిమ్మ పువ్వులంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరం.దానిమ్మ పువ్వులతో పూజ చేయడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఎర్రటి మందారాలతో వినాయకుడికి సంకష్టహర చతుర్దశి రోజు పూజ చేయటం వల్ల ఈతిబాధలు, సమస్త దోషాలు తొలగిపోతాయి .
అయితే ఎలాంటి పరిస్థితులలో కూడా వినాయకుడికి తులసి ఆకులతో మాత్రం పూజ చేయకూడదు.
పురాణాల ప్రకారం తులసికి, వినాయకుడికి మధ్య జరిగిన గొడవ కారణంగా తులసి వినాయకుడిని అందువల్ల తులసి ఆకులతో వినాయకుడికి పూజ చేయటం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయనీ పండితులు తెలియజేస్తున్నారు.
నేడు చంద్రబాబు పర్యటనలో మార్పులు