అల్లం సాగుకు అనుకూలమైన సమయాలు.. సస్యరక్షణ పద్ధతులు..!

ముఖ్యమైన వాణిజ్య పంటలలో అల్లం పంటను కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు.మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో అధికంగా సాగు చేస్తున్న పంటలలో ఈ అల్లం పంట కూడా ఒకటి.

కొందరు రైతులు మేలు రకం విత్తనాలను ఎంచుకొని, కొన్ని సస్యరక్షణ పద్ధతులు క్రమం తప్పక పాటిస్తూ అల్లం పంటను సాగు చేసి అధిక దిగుబడి పొందుతుంటే, మరికొంతమంది రైతులు సరియైన అవగాహన లేక ఆశించిన స్థాయిలో దిగుబడి పొందలేకపోతున్నారు.

అల్లం పంటలో అధిక దిగుబడి కోసం అనువైన సమయాలతో పాటు కొన్ని సస్యరక్షణ పద్ధతులు అవసరం.

నీటి వనరులు బాగా ఉంటే ఏ కాలంలో అయినా అల్లం పంట సాగు చేయవచ్చు.

వేడి, తేమతో కూడిన వాతావరణం అల్లం పంట సాగుకు అనుకూలం గా ఉంటుంది.

"""/"/ బంక మట్టి నేలలలో అయితే తెగుళ్ల సమస్య విపరీతంగా ఉంటుంది.అదే ఎర్ర గరప నెలలు, రేగడి నెలలలో 20-25 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండే నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

అల్లం పంట సాగుకు ఏప్రిల్- మే నెలలు అనుకూలం అని చెప్పవచ్చు.ఇక ముఖ్యంగా మనం ఎంపిక చేసుకునే విత్తనాల దుంపలు ఎలాంటి తెగుళ్లు లేకుండా ఉండడంతో పాటు భూమిలో కూడా తడి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇక విత్తుకోవడంలో ఒకవేళ ఆలస్యం అయితే దుంప కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి ఆలస్యం చేయకుండా తొందరగా విత్తుకోవాలి.ఒక ఎకరం పొలంలో దాదాపు 1000 కేజీల వరకు విత్తనం అవసరం.

అదే మెట్ట ప్రాంతాల్లో అయితే 700 కిలోల వరకు ఉంటుంది.మనం పొలంలో విత్తుకునే దూరాన్ని బట్టి విత్తనం మోతాదును బట్టి ఎకరాకు ఎన్ని విత్తనాలు అవసరమో ఆధారపడి ఉంటుంది.

"""/"/ కనీసం దుంపల మధ్య దూరం 1.5 అడుగులు ఉండేలా నాటుకోవాలి.

ఇక మొలక వచ్చిన దుంపలను మాత్రమే నాటుకోవాలి.మొలక పై భాగంలో ఉండేటట్టు దుంపను నాటాలి.

అల్లం పంటలో కీలకం విత్తన శుద్ధి.పంటను నాటుకునే ముందు విత్తన శుద్ధి చేస్తే తెగుళ్లు, చీడలను దాదాపుగా అరికట్టినట్టే.

ఇక నాటే సమయంలో పొలంలో తడి ఉండేటట్టు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ దుంపలు బాగా మొలకెత్తి ఆశించిన స్థాయిలో దిగుబడి పొందవచ్చు.

వాడికోసమే వైన్ షాప్ కు వెళ్లాను… అసలు విషయం చెప్పిన బన్నీ!