రాత్రికి రమ్మని ఓపెన్ గా అడుగుతారు.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఫాతిమా సనా షేక్ (Fatima Sana Sheikh)కూడా ఒకరు.
ఈ ప్రముఖ నటి తెలుగు నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఒకసారి హైదరాబాద్ లో ఒక నిర్మాతను కలిశానని ఆమె వెల్లడించారు.ఆ నిర్మాత నాతో చాలా ఓపెన్ గా కాస్టింగ్ కౌచ్ ప్రతిపాదన పెట్టారని నటి చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో కొంతమందిని కలవాల్సి ఉంటుందని ఆ కొంతమందితో గడపాల్సి ఉంటుందని ఓపెన్ గా నాతో అడిగాడని నటి పేర్కొన్నారు.
రాత్రికి రావాలని వాళ్లు పరోక్షంగానే అడుగుతారని కానీ వాళ్లు ఏం కోరుకుంటున్నారో క్లియర్ గా మాటలు చేతలతో అర్థమయ్యేలా చెబుతారని ఆమె వెల్లడించారు.
నిర్మాత కామెంట్లు విని తాను ఒకింత ఆశ్చర్యానికి గురయ్యానని ఫాతిమా వెల్లడించారు. """/" /
ఇలాంటిదే మరో ఆఫర్ ను కూడా తాను వదులుకున్నానని ఫాతిమా పేర్కొన్నారు.
హైదరాబాద్(Hyderabad) నుంచి ఒక కాస్టింగ్ ఏజెంట్ కాల్ చేశారని సినిమా కొరకు మీరు ఏం చేయడానికైనా సిద్ధమా అని అడిగాడని ఫాతిమా చెప్పుకొచ్చారు.
అతడు మరీ రెట్టించి అడిగాడని ఆమె తెలిపారు.ఆ వ్యక్తి ఇంకెంత దిగజారుతాడో చూడాలని నేను కూడా అదే పనిగా మాట్లాడానని ఫాతిమా తెలిపారు.
"""/" /
ఫాతిమా సనా షేక్ (Fatima Sana Sheikh)చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ నిర్మాతల పేర్లు వెల్లడించడానికి మాత్రం ఆమె ఇష్టపడలేదు.ఫాతిమా సనా షేక్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.
తెలుగు నిర్మాతల పరువు పోయే విధంగా ఫాతిమా కామెంట్లు చేయడం గమనార్హం.ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతున్నాయి.