ఆ తండ్రి త‌న కొడుకును ఆద‌ర్శ‌రైతును చేయాల‌నుకున్నాడు.... అయితే కొడుకు అంత‌కుమించి ఎదిగి...

ఏ పనైనా కఠోర శ్రమతో అంకితభావంతో పూర్తిచేస్తే విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని అంటారు.నేటి యుగంలో ఏ తండ్రైనా తన కొడుకుని ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ చేయాలని అనుకుంటాడు కానీ బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని సక్రా బ్లాక్‌కు చెందిన ప్రగతిశీల రైతు తన కొడుకును విజయవంతమైన రైతును చేయాలని ఎన్నో కలలు కన్నాడు.

ఈ రోజు ఆ కొడుకు తండ్రి కలలను నెరవేర్చాడు.అతని కృషి పూర్తిగా ఫ‌లించింది.

ముజఫర్‌పూర్‌లోని సక్రా బ్లాక్‌లోని మచ్చి గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు సోను నిగమ్ కుమార్, తన తండ్రి కలలను నెరవేర్చడానికి న‌డుంబిగించి వ్యవసాయం చేయడానికి పూనుకున్నాడు.

నాలుగు సంవత్సరాలలో సేంద్రియ వ్యవసాయం చేసి, నేషనల్ గార్డెన్‌ర‌త్న పుర‌స్కారాన్ని గ‌త ఏడాది మే 28న మహారాష్ట్రలోని జల్గావ్‌లో ఆద‌ర్శ‌రైతు సోనూ అందుకున్నారు.

ఈ అవార్డును అందుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన లేఖను మెయిల్ ద్వారా అంత‌కుముందు సోనూ అందుకున్నారు.

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసినందుకు గాను రాష్ట్రపతి గౌరవంతో సహా పలు అవార్డులు అందుకున్న తన తండ్రి దినేష్ కుమార్ 2019 ఆగస్టులో ఒక‌ ప్రమాదంలో మరణించారని సోనూ చెప్పారు.

తన కొడుకు కూడా బాగా చదువుకుని అధికారిగా కాకుండా రైతుగా ఎదిగి గ్రామస్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించాలని త‌న తండ్రి క‌లలు క‌నేవాడ‌ని సోను తెలిపారు.

"""/"/ తన తండ్రి మరణం తరువాత, సోనూ తన కలను సాకారం చేసే దిశ‌గా ముంద‌డుగు వేశారు.

సోను ప్ర‌స్తుతం అనేక రకాల కూరగాయలను పండిస్తున్నాడు.అలాగే విత్తనాలు లేని నిమ్మ, పర్వాల్ రూపొందంచిన కారణంగా అతనికి మంచి గుర్తింపు వ‌చ్చింది.

వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ సెంటర్ నుంచి పర్వాల్ మొక్కను, అలాగే నాలుగేళ్ల క్రితం మహారాష్ట్రలోని జల్గావ్ నుంచి నిమ్మమొక్క‌నును తీసుకొచ్చానని, ఈరోజు తన వద్ద 60 నిమ్మచెట్లు ఉండగా ఐదు ఎకరాల్లో పర్వాల్ సాగుచేస్తున్నానని సోనూ చెప్పారు.

తాను సాగుచేస్తున్న పర్వాల్ సాధారణ పర్వాల్ కంటే పెద్దదిగా ఉంటుంద‌ని, లోపల ఒకటి లేదా రెండు విత్తనాలు మాత్రమే ఉంటాయ‌ని తెలిపారు.

వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచక‌పోయినా కూడా ఇది పసుపు రంగులోకి మారద‌ని తెలిపారు.

"""/"/తాను సేంద్రియ వ్యవసాయమే చేస్తానని, ఏ మొక్కకూ రసాయన ఎరువులు వాడనని సోనూ స్ప‌ష్టం చేశారు.

అదేవిధంగా గింజలు లేని నిమ్మకాయ గుత్తిగా పెరుగుతుంద‌న్నారు.దీని పరిమాణం సాధారణ నిమ్మకాయ కంటే పెద్దదిగా ఉంటుంద‌ని, ఎంతో ర‌సంతో నిండి ఉంటుంద‌న్నారు.

ఏడాదికి ఒక‌కాపులో ఒక చెట్టు నుంచి 300 నిమ్మకాయలు కాస్తాయ‌ని సోనూ తెలిపారు.

క్రాఫ్టింగ్ ద్వారా నిమ్మ మొక్కల‌ను పెంచుతున్న‌ట్లు రైతు సోనూ తెలిపారు.

స్కంద ఫ్లాపైనా భారీగా రెమ్యునరేషన్ పెంచిన బోయపాటి.. పారితోషికం ఎంతంటే?