కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చడంతో.. కోర్టు సంచలన తీర్పు..!

ఇటీవలే కాలంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది.పిల్లలకు రక్షణ కల్పించాల్సిన తల్లిదండ్రులే పిల్లలపై దారుణాలకు పాల్పడుతున్నారు.

శరీర సుఖం కోసం వావి వరసలు మరిచి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.

అటువంటి కోవకు చెందిన ఒక తండ్రి కన్న కూతురిపై అత్యాచారం చేసి.కూతురు గర్భం దాల్చడానికి కారణం అవడంతో నాంపల్లి కోర్టు(Nampally Court) ఆ తండ్రికి కట్టిన శిక్షను విధించింది.

పోలీసుల సమాచారం ప్రకారం తూర్పుగోదావరి జిల్లాకు ఒక కుటుంబం బతుకుతెరువు కోసం హైదరాబాద్లోని ఫిలింనగర్ లో నివాసం ఉంటున్నారు.

"""/" / భర్త వాచ్మెన్ గా పని చేస్తుంటే.భార్య పలు ఇళ్లల్లో పనిమనిషిగా చేస్తుంది.

వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె సంతానం.కుమారుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక హాస్టల్లో చదువుకుంటున్నాడు.

14 ఏళ్ల కుమార్తె తల్లిదండ్రుల వద్ద ఉంది.అయితే 2021 జూన్ నెలలో కుమార్తెకు వాంతులు అవడంతో నాంపల్లి లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేపిస్తే అప్పటికే నాలుగు నెలలు గర్భంతో(Pregnant) ఉందని వైద్యులు తెలిపారు.

తల్లి కుమార్తెను గట్టిగా నిలదీయడంతో తండ్రి బండారం బయటపడింది. """/" / తాను తినే భోజనంలో తండ్రి మత్తు మాత్రలు కలిపి తనపై లైంగిక దాడికి పాల్పడేవాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాలని తెలిపింది.

ఈ విషయం బయటపడడంతో తండ్రి(Father) ఇంటి నుండి పరారయ్యాడు.ఆ కుమార్తె తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ తండ్రిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

తాజాగా కోర్టు నిందితుడు మరణించే వరకు జైల్లోనే ఉండాలంటూ శిక్ష విధించింది.ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారికి కట్టిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తూ.

మెట్రో లీగల్ సర్వీస్ అథారిటీ(Metro Legal Service Authority) ద్వారా బాధిత బాలికకు రూ.

7 లక్షల సాయం అందించాలని కోర్టు ఆదేశించింది.

ప్రశాంత్ వర్మ వైఖరి ఏంటో అర్థం కావడం లేదంటున్న విమర్శకులు… అసలేం జరిగింది..?