కొడుకుని చంపిన తండ్రి ... అసలు ఏమైంది అంటే..?
TeluguStop.com
కొన్ని కొన్ని సంఘటనలు చుస్తే.మానవ సంబంధాలన్నీ ఏమైపోతున్నాయో అన్న అనుమానం కలుగుతుంది.
తల్లిని కొడుకు చంపడం.కొడుకు తండ్రిని చంపడం.
ఇలా ఎన్నో ఎన్నెన్నో మన చుట్టూ సర్వ సాధారణంగా జరిగిపోతున్నాయి.ఇదంతా మన చుట్టూనే జరుగుతున్నా.
అయ్యో పాపం అనడం తప్ప ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి.ఇటువంటి సంఘటనే తాజాగా.
నెల్లూరు జిల్లాలో జరిగింది.మద్యానికి బానిసైన కొడుకు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక కన్న తండ్రే కొడుకును హతమార్చిన ఘటన నెల్లూరు జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;"https://telugustop!--com/wp-content/uploads/2018/12/death-k!--jpg"/
విడవలూరు మండలం, చౌకిచర్ల గ్రామానికి చెందిన వెంకయ్యకు, కిరణ్ (35) అనే కుమారుడు ఉన్నాడు.
నెల్లూరులోని ఓ డెంటల్ హాస్పిటల్‌లో పనిచేసే కిరణ్ రోజూ పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లి తల్లి దండ్రులను హింసిస్తుండేవాడు.
బైటవాళ్లతో నిత్యం గొడవలు పడుతుండేవాడు.ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికెళ్లిన కిరణ్ యధావిధిగా తల్లిదండ్రులపై కూడా తన ప్రతాపాన్ని చూపాడు.
కొడుకు పెడుతున్న చిత్ర హింసలను భరించలేక మద్యం మత్తులో ఇంట్లో పడి ఉన్న కిరణ్ ను తండ్రి వెంకయ్య రోకలితో తలపై కొట్టి హత్య చేశాడు.
ఈ రోజు ఉదయం విషయం తెలుసుకున్న విడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.