తండ్రి చనిపోయాడు…తల్లి వదిలేసింది…!

యాదాద్రి భువనగిరి జిల్లా: తల్లిదండ్రులు చనిపోయి లేదా తండ్రి చనిపోయి,తల్లి వదిలేసి లేదా తల్లి చనిపోయి తండ్రి వదిలేసి పిల్లలు ఒంటరిగా మారడం,ఆ తర్వాత అయినవాళ్ళు కూడా వారిని దూరం చేయడం,పేదరికంలో మగ్గుతున్న ఒక బంధువుల కుటుంబం వారిని చేరదీయడం,రెక్కల కష్టం మీద బ్రతికేవారు కూటికి,గుడ్డకు నోచుకోక అనేక ఇబ్బందులు పడుతూ పస్తులుండడం సీన్ కట్ చేస్తే ఆ పిల్లలే కష్టపడి ఉన్నత స్థితికి చేరుకోవడం, లేదా అక్కడి నుండి బయటికెళ్లి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ జీవించడం లాంటి దృశ్యాలు ఎక్కువగా తెలుగు సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి.

కానీ, సేమ్ టు సేమ్ అలాంటి హృదయ విదారక సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం ఐదోనల్ తండాలో వెలుగులోకి వచ్చింది.

స్థానికుల కథనం ప్రకారం.ఏడేళ్ల క్రితం తండ్రి రమావత్ గణేష్ చనిపోయాడు.

కొద్దిరోజుల తర్వాత తల్లి పార్వతి తన ముగ్గురు చిన్నారులు ఐదోనల్ తండాలో మేనత్త లలిత ఇంటిదగ్గర వదిలేసి ఎటో వెళ్లిపోయింది.

మేనత్త లలితకు నలుగురు పిల్లలు ఉండడంతో కుటుంబం గడవడం భారంగా మారింది.దీంతో తల్లిదండ్రులు లేకుండా మేనత్త వద్ద అనాధలుగా ఉండడం చూసి స్థానికులు తోచినంత సహాయం చేస్తుండగా జీవనం కొనసాగిస్తున్నారు.

ఈముగ్గురు చిన్నారుల పరిస్థితిని గమనించి మనసున్న మారాజులు సహాయం చేస్తారని ఎదురుచూస్తున్నారు.బుక్కెడు బువ్వకు కరువై అనాధలుగా మిగిలిపోయాం మమ్ములను ఆదుకొండని ఆ చిన్నారులు వేడుకుంటుంటే చూసేవాళ్ల కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.

తనకున్న నలుగురు పిల్లలకు తోడు ముగ్గురు పిల్లలు తోడవడంతో కూలీనాలీ చేస్తూ బ్రతికే నాకు కూడా ఇబ్బందిగా ఉంటుందని మేనత్త లలిత ఆవేదన వ్యక్తం చేస్తుంది.

ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ ముగ్గురు చిన్నారుల ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

స్టార్ హీరోయిన్ చెప్పులు మోసిన భర్త.. ఇలాంటి భర్త దొరికిన సోనాక్షి లక్కీ అంటూ?