తండ్రి చనిపోయాడుకొని కర్మ చేశాడు.. కానీ 25 ఏళ్ల తర్వాత తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు!

జీవితం అంటేనే చిత్ర విచిత్రాల నెలవు.ఒక వ్యక్తి జీవితంలో అనుకోని విషయాలు చాలా చాలా జరుగుతుంటాయి.

దాదాపు 25 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి తన కుటుంబానికి దూరమయ్యాడు.అతని పేరు సోమేశ్వర్ దాస్.

అతడు ఉండేది ఒడిశాలోని కటక్ ప్రాంతం.అతనికి మానసిక స్థితి సరిగా లేదు.

దాదాపు 25 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి ఏటో వెళ్లి పోయాడు.ఎటు వెళ్లాడో ఎవరికీ తెలియదు.

కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేదు.ఊరూ వాడా అంతా గాలించారు.

కానీ ఫలితం లభించలేదు.సోమేశ్వర్ దాస్ కు చెందిన ఏ సమాచారం కూడా దొరకలేదు.

కుటుంబ సభ్యులు ఓపిక ఉన్నన్ని రోజులూ వెతికారు.అలా అలా కాలం గడుస్తూ వచ్చింది.

చూస్తుండగానే 25 ఏళ్లు గడిచాయి.ఆ కుటుంబ సభ్యులు సోమేశ్వర్ దాస్ ఇక లేడనే భావించారు.

చనిపోయి ఉంటాడని అనుకున్నారు.కానీ పాతికేళ్ల తర్వాత అతను తిరిగి కుటుంబ సభ్యులను చేరడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

పట్టరాని సంతోషంతో ఆనంద భాష్పాలు కార్చారు.సోమేశ్వర్ దాస్ ఇంటి నుండి వెళ్లి పోయాక అతడిని రాజస్థాన్ భరత్ పుర్ లోని అప్నాఘర్ ఆశ్రమం ఆదరించింది.

అన్ని సౌకర్యాలు కల్పించింది.అవసరమైన వైద్య సాయం చేసింది.

సోమేశ్వర్ చెప్పిన విషయాల ఆధారంగా అతడి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించింది.

మరోవైపు కుటుంబ సభ్యులు అతడి గురించి వెతికి వెతికి నీరసించి పోయారు.గతేడాది అంటే సోమేశ్వర్ దాస్ ఇంటి నుండి వెళ్లి పోయిన 24 ఏళ్ల తర్వాత ఇక ఆశలు వదులుకున్నారు.

అంటే అతడు చని పోయి ఉంటాడన్న నిర్ణయానికి వచ్చారు.ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అవసరమైన పూజలు చేయించారు.

భర్త లేడని వితంతువుగా జీవించండం మొదలు పెట్టింది సోమేశ్వర్ దాస్ భార్య.కొన్ని రోజుల క్రితం సోనాలతా, ఆమె కొడుకు సంతోష్ దాస్ ఇంటికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.

సోమేశ్వర్ దాస్ సజీవంగా ఉన్నారని, భరత్ పుర్ వచ్చి ఆయనను తీసుకు వెళ్లాలని ఆ కాల్ చేసిన వ్యక్తి చెప్పారు.

సోనాలతా, సంతోష్ అసలు నమ్మలేక పోయారు.25 ఏళ్ల క్రితం ఇంటి నుండి వెళ్లి పోయిన వ్యక్తి.

చనిపోయాడని అనుకున్న తర్వాత ఇలా సమాచారం అందడం వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది.

ఆనందం పట్టలేక కన్నీరు పెట్టారు.సంతోష్ అప్నాఘర్ ఆశ్రమానికి వెళ్లి తండ్రిని కలుసుకున్నాడు.

నాన్నను పట్టుకుని మనసారా ఏడ్చాడు.తర్వాత ఇంటికి తీసుకువెళ్లాడు.

పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే సినిమా ఫ్లాపేనా… ఇదేం లాజిక్?