ఛత్తీస్‎గఢ్‎లో ఘోర రోడ్డుప్రమాదం.. 15 మంది మృతి

ఛత్తీస్‎గఢ్‎( Chhattisgarh )లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కుక్‎దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్‎పాని గ్రామ సమీపంలో ఓ వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో పదిహేను మంది మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.అలాగే మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.తునికాకు ఆకులు తీయడానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.