చాలామంది ప్రజలు వారానికి ఒకరోజు లేదా రెండు రోజులు ఉపవాసం( Fasting ) చేయడం మనం చూస్తూ ఉంటాము.
కొంతమంది ఈ దేవుడి మొక్కు, ఆ దేవుడి ముక్కు అని వారంలో కనీసం ఒక్కరోజైనా ఉపవాసం పాటిస్తూ ఉంటారు.
అలాగే కోరికలు నెరవేరుతాయని ఇలా రకరకాల కారణాల వల్ల ఉపవాసాలు ఉండేవారు కూడా ఉన్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఉపవాసం అంటే చాలామందికి సరైన అవగాహన లేదు.ఉపవాసం ఎందుకు చేయాలి, ఏలా చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
వారానికి ఒక్క రోజు ఉపవాసం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఈ కాలంలో ఉపవాసాలు చేసే వారు పండ్లు,పండ్ల రసాలు తాగుతూ ఉపవాసం చేస్తున్నారు.
తిని ఉపవాసం చేస్తే అది ఉపవాసం కానే కాదు.దీనికి సరైన ఫలితం అసలు ఉండదు.
ఉపవాసం అంటే ఏది తినకుండా ఒక గ్లాసులో మూడు నాలుగు చెంచాల తేనె, ఒక నిమ్మకాయ రసం పిండి తాగాలి.
తాగిన గంటకు ఒక గ్లాసు మంచినీళ్లు( Water ) తాగాలి.మొదట నిమ్మరసం తేనె( Lemon Honey ) తర్వాత మంచి నీళ్లతోనే పగలు మొత్తం ఉండాలి.
"""/" /
తేనె, నిమ్మరసం తాగడం వల్ల నీరసం రాదు.ఇలా చేయడం వల్ల జీర్ణశయానికి కాస్త విశ్రాంతి లభిస్తుంది.
అంతేకాకుండా శరీరం తనకు తాను రిపేర్ కూడా చేసుకుంటుంది.ఆహారం తిన్నప్పుడు శక్తి ఖర్చు అయిపోతుంది.
సాయంత్రం పూట 6 గంటలలోపు మిత ఆహారం తినాలి.రెండవ రోజు ఉపవాసం చేయడం వల్ల శరీరం దానికి అదే రిపేర్ చేసుకుని ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా దూరమవుతాయి.
అలాగే ఉపవాసం తర్వాత మరుసటి రోజు పండ్ల రసాలు, పండ్లు తినడం ఎంతో మంచిది.
మూడవ రోజు నుంచి యధావిధిగా ఏ ఆహారమైన తినవచ్చు.షుగర్ ఉన్నవారు రోజుకు 4 నుంచి 5 టాబ్లెట్లు వాడేవారు, బాగా నీరసంగా ఉన్నవారు, పాలిచ్చే తల్లులు, కళ్ళు తిరుగుతున్న వారు ఉపవాసం చేయకూడదు.