యూఎస్ గ్రీన్ కార్డ్.. భారత సంతతి వైద్యులను పట్టించుకోండి : ఎన్ఆర్ఐ డాక్టర్ల సంఘం
TeluguStop.com
అమెరికాలో గ్రీన్‌కార్డ్( Green Card) కోసం భారతీయులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడున్న బ్యాక్‌లాగ్ పెండింగ్‌లు, కంట్రీ క్యాప్ నిబంధనను బట్టి భారతీయ దరఖాస్తుదారులకు గ్రీన్ కార్డ్ రావాలంటే దశాబ్ధాలు పట్టొచ్చని నిపుణులు అంటున్నారు.
త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన వైద్యుల సంఘం అధిపతి కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ , హెల్త్ కేర్ సంస్కరణలకు ప్రాధాన్యతను ఇవ్వాలని .
భారతీయ వైద్య నిపుణుల గ్రీన్ కార్డ్ దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేయాలని పిలుపునిచ్చారు.
"""/" /
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ)( American Association Of Physicians Of Indian Origin ) అధ్యక్షుడు సతీస్ కత్తుల( Satheesh Kathula).
ఓ భారత జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడారు.ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ, ఇమ్మిగ్రేషన్, వీసా సమస్యలు, వైద్యంలో సాంకేతికత, వైవిధ్యం, వివక్షపై వ్యతిరేక చర్యలు వంటి అంశాలపై తదుపరి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
1982లో స్థాపించబడిన ఏఏపీఐలో 1,20,000 మంది భారత సంతతికి చెందిన వైద్యులు సభ్యులుగా ఉన్నారు.
"""/" /
15 నుంచి 20 ఏళ్లకు పైగా అమెరికాలో ఉంటున్నప్పటికీ ఇంకా హెచ్ 1 బీ వర్క్( H1B Visa ) వీసాలపై అనేక మంది డాక్టర్లు పనిచేస్తున్నారని సతీష్ చెప్పారు.
వారు అమెరికాలోనే కొనసాగేలా, వీసా స్టేటస్ గురించి ఇబ్బంది పడకుండా తమ పని చేసుకోవడానికి వీలుగా గ్రీన్ కార్డ్ దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేయాలని సతీష్ కోరారు.
వారు కనుక అమెరికాను వీడితే కొన్ని పట్టణాల్లో మొత్తం ఆరోగ్య వ్యవస్ధ కుప్పకూలుతుందని, అందువల్ల వైద్యులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
అమెరికాలోని ఏడు మంది రోగుల్లో ఒకరు భారత సంతతి వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటున్నాడని సతీష్ కత్తుల చెప్పారు.
అమెరికాలో హెచ్ 1 వీసాపై ఉన్న వైద్యులపైనే పూర్తిగా ఆధారపడిన కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్10, ఆదివారం 2024