కప్పకు నీళ్లు పోస్తూ వరుణ పూజలు చేసిన రైతులు

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట పట్టణం( Ramannapeta )లోని సుభాష్ సెంటర్లో వర్షాలు కురవాలంటూ కప్పకాముడు ఆడుతూ పాటలు పాడుతూ కప్పలకు( Frogs ) నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు.

వరుణదేవా.కరుణించవయ్యా.

వానలు కురవాలి పంటలు పండేలా చూడవయా.అంటూ వరుణ దేవున్ని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు( Farmers ) కందుల హనుమంతు,పెద్దబోయిన శంకరయ్య,హరే రాములు, బండ శ్రీశైలం,గాదె రాము, ఫర్టిలైజర్ వెంకట్ రెడ్డి, మహిళలు గొర్ల అండాలు, నకిరేకంటి సుగుణమ్మ,గాదె పద్మ,నకిరేకంటి దేవేంద్ర,బొడ్డు మణమ్మ,గాదె లక్ష్మమ్మ,గోర్ల గీత,మేడి రాములమ్మ, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలలు బ్రేక్ లేకుండా 1200 కి.మీ ప్రయాణించిన పిల్లి.. చివరికి..?