వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ముడుపు విప్పిన రైతులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల రావి చెట్టు హన్మాండ్లు కు పంటలు పొట్ట దశకు ఉన్నప్పుడు రాళ్ల వర్షం కురవకుండా ఉండడం కోసం రావి చెట్టు హన్మాండ్ల ఆలయంలో (Sacred Fig , Hanmandla Temple)ముడుపు వేయడం జరిగింది.

అట్టి ముడుపును నేడు రైతుల ఆధ్వర్యంలో పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ ద్వారా ముడుపును విప్పారు.

త్వరగా వర్షాలు కురవాలని హన్మాండ్లను రైతులు వేడుకున్నారు.పూజ కార్యక్రమం అనంతరం రైతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

రేపు సాయంత్రం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న బండ్ల బోనాల (Bandla Bonalu)కార్యక్రమం నిర్వహణ జరుగుతుందనీ రైతులు తెలిపారు.

వీడియో: బైక్‌ చక్రంతో ట్రైన్‌లోని ప్యాసింజర్లపై నీళ్లు చల్లారు.. కట్ చేస్తే??