అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి…ఒగ్గు రజిత యాదవ్

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతుల పొలాలను ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ పరామర్శించారు.

ప్రకృతి వైపరీత్యాలకు వడ్లు ఒక్క విత్తు లేకుండా నేల రాలిపోవడం రైతుల నెత్తిన పిడిగుద్దు పడినట్లయిందని అన్నారు.

ఇప్పటికి వరిపంటలు ఊసతిరిగిపోయి వడ్లు సరైన బరువు రాకపోవడం అన్ని కలిపి ములిగే నక్కపై తాటికాయపడ్డట్లఇందని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ అన్నారు.

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పంటపొలాలు పరిశీలిస్తారని వారికి రైతులు సహకరించాలని రైతులను కోరారు.

ఆమె వెంట రైతులు నూకల శ్రీనివాస్ యాదవ్, నూకల బాలరాజు యాదవ్, కొర్ర వేణు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

స్టార్ హీరో ప్రభాస్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ఖరీదెంతో తెలుసా.. ఏకంగా అంత ఖర్చు చేశారా?