అకాల వర్షాలతో అన్నదాతలు అతలాకుతలం…!

నల్లగొండ జిల్లా:జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో ( Untimely Rains )అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని నకిరేకల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి యాతాకుల అంజయ్య( TDP Incharge Yathakula Anjaiah ) అన్నారు.

గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ నుండి బాధిత రైతులు ఫోన్ చేయగా మార్కెట్ ను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గత 20 రోజుల క్రితం ఓ రైతు 90 పుట్ల ధాన్యం మార్కెట్ కి తెస్తే నిమిషాల వ్యవధిలోనే వచ్చిన గాలివానకు 2 పుట్లు తడిసి,కళ్లముందే కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయిందని విలపించారని అన్నారు.

ధాన్యం మార్కెట్ నిర్వాహకులు కాంటాలు వేయకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని,వర్షాల నుండి పంటను కాపాడుకోవడానికి తగిన పట్టాలు కూడా ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తుందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే స్వందించి రైతులు మార్కెట్ లో పోసిన,తడిసి రంగు మారిన,మొలకెత్తిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు వెంకట్ రెడ్డి,సైదులు, టీడీపీ నకిరేకల్ మండలం మాజీ ప్రధాన కార్యదర్శి దోమ్మాటి సైదులు,కేతెపల్లి మండలం ప్రధాన కార్యదర్శి దోనాల వెంకటరెడ్డి,సీనియర్ నాయకులు బాది భిక్షం గౌడ్,ఎర్ర అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్న ఆ స్టార్ హీరో…