వైసీపీకి రైతులు అండగా నిలవాలి..: మంత్రి కారుమూరి

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Karumuri Nageswara Rao ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇందులో భాగంగా మండలంలో ప్రతి ఇంటికి వెళ్తూ వైసీపీ చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని మంత్రి కారుమూరి ప్రజలకు వివరించారు.

ఈ ప్రచారంలో భాగంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దని తెలిపారు.

ఆర్బీకేల ద్వారానే రైతులు ధాన్యాన్ని తరలించాలని సూచించారు.సీఎం జగన్( CM Jagan ) రైతు పక్షపాతన్న మంత్రి కారుమూరి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో వైసీపీకి రైతులు అండగా ఉండాలని ఆయన కోరారు.

పవన్ కళ్యాణ్ వల్లే పుష్ప 2 సినిమా పోస్ట్ పోన్ అయిందా..? అసలేం జరుగుతోంది…