కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరి ధాన్యం విక్రయించాలి మద్దత్తు ధర పొందాలి – ఎంపిపి పిల్లి రేణుక కిషన్

ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు వరి ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలం కృష్ణ నాయక్ గ్రామపంచాయతీ తండా లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , సర్పంచ్ ప్రభూ నాయక్ రిబ్బన్ కత్తిరించి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలు వడ్ల కు 2060 రూపాయలు గా ప్రకటించిందని ఆమె తెలిపారు.

రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం తరఫున మహిళా సంఘాల ద్వారా సింగిల్ విండోల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

ఎఫ్సిఐ అధికారులు నిర్ణయించిన తేమ శాతం ప్రకారం రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి వారికి సహకరించాలని ఆమె కోరారు.

తూకాల్లో తేడాలు రాకుండా మహిళా సంఘాలు , సింగిల్ విండో నిర్వాహకులు రైతులకు సహకరించాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ సభ్యురాలు రజిత , రాజన్నపేట సర్పంచ్ ముక్క శంకర్ , బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కల్లూరి వెంకటరమణ రెడ్డి , ఏపీఎం మాలేషం ,దేవేందర్ , గ్రామ రైతులు భూక్యా శంకర్ నాయక్, రాములు నాయక్ , హాసన్ , కిషన్ , రాజు రమేష్ , ఐకేపీ సీసీ పద్మ , బానోత్ నాజీమ్ , సి ఎ పద్మ , ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

వేణుమాధవ్ కామెడీగా చెప్పిందే సినిమా తీసి హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ఏమైందంటే?