రైతులు అధైర్య పడద్దు ప్రభుత్వం ఆదుకుంటుంది..జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపెట్ మండలం మర్రిమడ్ల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి( Aruna Raghavareddy ) క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు.

దెబ్బ తిన్న పంటల నివేదిక త్వరగా తయారు చేయాలనీ అధికారులను ఆదేశించారు.మర్రిమడ్ల గ్రామంలో చెక్ డ్యాం వద్ద ఇసుక కొట్టుకు పోయి పంట పొలాలకు వరద వచ్చి, పొలాలలో ఇసుక పేరుకుపోయింది.

దీనికి గాను ఇరిగేషన్ ఇఇ తో మాట్లాడి పొలాల్లో పేరుకుపోయిన ఇసుకను వెంటనే తొలగించాలని ఆదేశించారు.

వీరి వెంట సర్పంచ్ అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశం, నాయకులు న్యాలకొండ రాఘవ రెడ్డి, దేవరాజు, వ్యవసాయ అధికారులు, రైతులు ఉన్నారు.

రాజబాబు అసలు పేరేంటో మీకు తెలుసా.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నారా?