Farmers Chalo Delhi : రేపు రైతుల చలో ఢిల్లీ నిరసన.. భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ, హర్యానా సరిహద్దుల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.రేపు రైతులు చలో ఢిల్లీ( Chalo Delhi ) నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

ఈ క్రమంలోనే రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగానే ఢిల్లీ సరిహద్దుల్లో( Delhi Border ) హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు హర్యానాలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.అలాగే సింగు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు, వాటర్ కానన్ వాహనాలతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

"""/" / మరోవైపు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ రైతులతో( Farmers ) చర్చలు జరపనున్నారు.

అయితే వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పంటలకు కనీస మద్ధతు ధరతో పాటు ఇతర అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని హర్యానా, పంజాబ్ రైతులు నిర్ణయం తీసుకున్నారు.

కిచెన్‌లో వింత వాసన.. ఏంటా అని చూస్తే కాలిఫోర్నియా మహిళకు షాక్‌..?