దీక్ష ముగించిన అమరావతి రైతులు.. శిబిరాలు తొలగింపు..!!
TeluguStop.com
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు( AP CM Chandrababu ) ప్రమాణ స్వీకారం చేశారు.
దీంతో అమరావతి ఏకైక రాజధానిగా ఉంచాలని దీక్షలు చేస్తున్న రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
విషయంలోకి వెళ్తే అమరావతికి పునర్వైభవం వచ్చే పరిస్థితి నెలకొనడంతో వెలగపూడిలో దీక్షా శిబిరాలు తొలగించారు.
గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అని ప్రకటన చేయటం తెలిసిందే.ఈ ప్రకటనతో 2014లో ఏపీ ప్రభుత్వానికి రాజధాని కోసం 30 వేల ఎకరాలను ఇచ్చిన రైతులు ఒక్కసారిగా ఆందోళన చెందారు.
అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు.
"""/" /
1631 రోజులు పాటు రైతులు దీక్షలు చేయడం జరిగింది.అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోయింది.
ఎన్నికలలో కూటమి అధికారంలోకి వచ్చింది.ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి తాము అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడం జరిగింది.
ఈ క్రమంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు.ఏపీకి అమరావతి ( Amaravati )రాజధాని అని ఆనందం వ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయటంతో.వెలగపూడిలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్లు రైతులు ప్రకటించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకం తమకుందని రైతులు పేర్కొన్నారు.
కుక్క కోసం వెరైటీ సూట్‌కేసు కొన్న ఎన్నారై.. దీని ధర ఎన్ని లక్షలో తెలిస్తే..!