పెట్టుబడి సాయం కోసం రైతులకు తప్పని ఎదురుచూపులు

నల్లగొండలో జిల్లా:యాసంగి సీజన్ లో రైతులకు అందాల్సిన పంట పెట్టుబడి సాయం నెమ్మదిస్తోంది.

పెట్టుబడి సాయం అందించడానికి రాష్ట్ర ఖజానాలో నిధుల కొరత తీవ్రంగా ఉందనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతుంది.

పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ప్రకటించి ఐదు రోజులైనా ఇప్పటి వరకు ఎకరంలోపు భూమి ఉన్న రైతులకే సాయం వారి ఖాతాల్లో జమైంది.

విడతల వారిగా రోజుకో ఎకరం విస్తీర్ణం పెంచుతూ పక్షం రోజుల్లో మెజార్టీ రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉంది.

కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరును రైతు భరోసా( Rythu Bharosa )గా మార్చింది.

ఎకరం భూమికి ఒక్కో సీజన్లో రూ.7,500 చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది.

రైతు భరోసా విధి విధానాలను ఇంకా ఖరారు చేయకపోవడంతో ఈ సీజన్లో పాత పద్దతిలోనే ఎకరానికి రూ.

5వేల చొప్పున సాయం అందించడానికి ప్రభుత్వం సమాయత్తమైంది.ఈనెల 13 నుంచి జమ చేస్తున్నామని వెల్లడించగా ఇప్పటి వరకు ఐదు ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కావాల్సి ఉంది.

ఇప్పటి వరకు పెట్టుబడి సాయం జమ కావడంలో వేగం పెరుగలేదు.నల్లగొండలో జిల్లా( Nalgondalo District )లో 5.

30 లక్షల మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులుగా ఉన్నారు.వారికి సంబంధించిన రూ.

610 కోట్లు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.పెట్టుబడి సాయాన్ని ఐదు ఎకరాలకు కుదించడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు,బడా వ్యాపారులు,ఆర్థికంగా వృద్ధి చెందినవారికి ఇవ్వకూడదనే డిమాండ్ ముందు నుంచి వినిపిస్తోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదేమీ పరిగణలోకి తీసుకోకుండా భూమి ఉండి పట్టా పాసు పుస్తకం పొందిన ప్రతి ఒక్కరికి సాయం నిధులు జమ చేశారు.

వందల ఎకరాల భూమి ఉన్న రైతులు,వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు పెట్టుబడి సాయం జమ చేశారు.

ఈ విధానంతో రాష్ట్ర ఖజానా దివాళ తీసే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో ప్రతిప క్షాలు విమర్శించాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుభరోసా కింద అందించే సాయం విషయంలో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని ప్రకటించారు.

యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధానాలు రూపొందించి సాయం జమ చేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

పాత పద్ధతిలో జమచేసి వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమ చేసే అవకాశం సైతం ఉంది.

పాత పద్ధతిలోనైనా మెజార్టీ రైతులకు సాయం జమ కావాల్సి ఉన్నా ఖజానాలో నిధుల కొరత కారణంగా పెట్టుబడి సాయం జమ చేయడంలో జాప్యం జరుగుతుందనే అభిప్రాయం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రభుత్వం స్పందించి అసలైన రైతులకు పెట్టుబడి సాయాన్ని వేగంగా జమ చేయాలని పలువురు కోరుతున్నారు.

ఈ యూకే ఖైదీ చాలా డేంజరస్.. 50 ఏళ్లుగా జైల్లోనే..?