మట్టి టిప్పర్లను అడ్డుకున్న రైతులు

సూర్యాపేట జిల్లా:ఖమ్మం-మిర్యాలగూడ నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కోదాడ బైపాస్ కి మట్టిని తరలించే టిప్పర్లను రైతులు అడ్డుకున్నారు.

కోదాడ మండలం నెమలిపురి కాలనీ- కాపుగల్లు గ్రామాల మధ్య నుండి కోదాడ బైపాస్ రోడ్డుకు నెల రోజుల నుండి మట్టిని తరలిస్తున్నారు.

టిప్పర్ల ధాటికి రోడ్డు,పంటలు దెబ్బతిని నష్టపోతున్నామని కాపుగల్లు,నెమలిపురి కాలనీకి చెందిన రైతులు ఆదివారం రోడ్డుకు అడ్డంగా కంప వేసి ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజుల నుండి మట్టిని తరలిస్తున్నారని,టిప్పర్లు అధిక లోడుతో రాకపోకలు జరపడంతో రోడ్డు మొత్తం కొట్టుకపోయి గుంతలుపడి ధ్వంసమైందన్నారు.

నిత్యం టిప్పర్లు తిరగడం వల్ల దుమ్ము లేచి,పంటచేలపై పడి తీవ్రంగా పంటలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంతల్లో పెద్ద సైజు కంకర పోయడం వలన అవి రోడ్డు మీదకు చేరి రైతులు పొలాల దగ్గరకు వెళ్ళడానికి ఇబ్బందిగా మారిందన్నారు.

ఎవరికి చెప్పినా తమ గోడు పట్టించుకోవడం లేదని అందుకే రెండు గ్రామాల రైతులంతా కలిసి ధర్నాకు దిగినట్లు చెప్పారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Good Friday : గుడ్ ఫ్రైడే ఎప్పుడు? గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత గురించి తెలుసా..?