పోలీస్ బెటాలియన్ వద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల ఆందోళ

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం(Narayanapoor ) మండల పరిధిలో గల 255 సర్వే నంబర్ గల భూమిని పోలీస్ బెటాలియం కోసం కేటాయిస్తున్నట్టు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం మండల ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ 72 సంవత్సరాల నుండి భూమిని రైతులు సాగు చేసుకుంటే మా పొట్ట కొట్టడానికి బెటాలియన్ కేటాయిస్తారా అని రైతులు( Farmers) ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల భూములు లాక్కోవడం విడ్డూరమని, వెంటనే అమలు చేసిన నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

లేనియెడల అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకలు జరుగుతాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దేశిడి నరేందర్,చిలివేరు అంజయ్య,తెలంగాణ భిక్షం,బొమ్మగోని రమేష్, జక్కిడి యాదిరెడ్డి, బొడ్డుపల్లి గాలయ్య, చిలివేరు నర్సింహ, మెగావత్ నర్సింహ, చిలివేరు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

విక్రమ్ లాంటి నటుడు ఎవరూ ఉండరుగా.. సరైన కథలను ఎంచుకుంటే దబిడిదిబిడే!