రైతు రుణమాఫీ కొందరికేనా…50 శాతం మించని లబ్ధిదారులు

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో అన్నదాతలు బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు.

జిల్లాలో కనీసం 50 శాతం మందికి కూడా రుణమాఫీ కాలేదని,అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా అనేక సాంకేతిక కారణాల చూపుతూ రుణమాఫీ చేయపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం,ఆచరణలో మాత్రం రేషన్ కార్డు( Ration Card ) ఉన్న వారికే మాఫీ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

అన్ని అర్హతలు ఉన్నా ఎంతో మంది రైతులు రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ,వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.

ఇదే విషయమై వ్యవసాయ అధికారులను అడిగితే రుణమాఫీకి అర్హులై,రేషన్ కార్డు లేని వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని,త్వరలోనే అర్హులందరికీ రుణమాఫీ వస్తుందని అంటున్నారని,కానీ,ఎంత కాలం పడుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నారని,కొందరికి రుణమాఫీ కావడంతో సంతోషంగా ఇంటే ఇంకా సగంమంది తమకు అవుతుందో లేదో తెలియక అయోమయంలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సామాన్య రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఇక గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలుగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల పరిస్థితి మరో రకంగా ఉందని అంటున్నారు.

గత పదేళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేశామని, ఎన్నో గొడవలు,కేసులు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తీరా మాకే రుణమాఫీ కాక పరిస్థితి గోరంగా ఉందని, గ్రామాల్లో తలెత్తుకొని మాట్లాడే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకులో పంట రుణం ఉన్న ప్రతిఒక్క రైతుకి రూ.

2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆశ్చర్యం: కారులో వెళ్తూనే బిడ్డను ప్రసవించింది.. వీడియో వైరల్..