పిడుగుపాటుకు రైతు మృతి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు(lightning) రైతు కామిడి నర్సింలు (48) (kamidi Narsinlu)మృతి చెందాడు.
మృతునికి భార్య చంద్రకళ (45), కుమారుడు అజయ్ (20) ఉన్నారు.స్థానికులు తెలిపిన వివరాలు.
గ్రామానికి చెందిన రైతు నర్సింలు గురువారం ఉదయం పొలం వద్ద గేదే పాలు పిండేందుకు వెళ్లారు.
అక్కడే ఉన్న నీటి సంపు వద్ద కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటుండగా పిడుగు పడింది.
ఈ ప్రమాదంలో నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు తెలిపారు.
జుట్టు దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ ను వాడండి!