భయపెడుతున్నపెట్రోల్ బాటిల్ !
TeluguStop.com
ప్రభుత్వ కార్యాలయాల్లో మామూళ్లు ఇస్తే కానీ ఏ పని జరగదు అనే విషయం అందరూ సామాన్యంగా చర్చించుకునే విషయమే ! ప్రజలు కూడా ఆ విధంగానే మామూళ్లు సమర్పించుకుంటూ తమ పని చక్కబెట్టుకుంటూ వస్తున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం తెలంగాణ లో తహశీల్ధార్ విజయరెడ్డిపై సురేష్ అనే రైతు పెట్రోల్ బాటిల్ తో దాడి చేసి ఆమెకు నిప్పు పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.అయితే అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది వణికిపోతున్నారు.
భయం భయంగానే విధులు నిర్వర్తిస్తూ తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇక ఏపీలోనూ ఆ ప్రభావం చాలా గట్టిగానే కనిపించింది.
కర్నూలు జిల్లాలోని పత్తికొండ తహశీల్దార్ ఉమా మహేశ్వరి తన చాంబర్ చుట్టూ తాడు కట్టించడం, ఎవరైనా అర్జీలు ఇవ్వాలంటే తాడు బయటనుంచే ఇవ్వాలని చెప్పడం బాగా వైరల్ అయ్యింది.
ఇక ఎక్కడికక్కడ రెవెన్యూ సిబ్బంది తమకు తగిన రక్షణ చర్యలు కల్పించకపోతే విధులు నిర్వర్తించలేము అంటూ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు.
ఇక విషయానికి వస్తే తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి తహశీల్దార్ కార్యాలయానికి ఒక రైతు పెట్రోల్ డబ్బాతో రావడంతో తహశీల్దార్ కార్యాలయ సిబ్బందిని హడలెత్తించింది.
కార్యాలయం లోపల ఉన్న సిబ్బంది అంతా ఒక్కసారిగా బయటకి పరుగులు తీయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
అయితే చంద్రయ్య వచ్చింది పెట్రోల్ తో దాడి చేయడానికి కాదు తన భూమి విషయం ఆరా తీయడానికి వచ్చాడని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల చంద్రయ్య అనే రైతు ఒక వ్యక్తి దగ్గర 29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు.
కొనుగోలు చేసిన భూమిని తన భార్య పేరు మీద రిజిష్టర్ చేయించుకోవాలని చంద్రయ్య తహశీల్దార్ కు ధరఖాస్తు చేసుకున్నాడు.
తహశీల్దార్ ఆఫీస్ లో తన ధరఖాస్తు గురించి తెలుసుకోవటానికి వచ్చాడు.అయితే విషయం తెలియని రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఇలా హడలెత్తిపోయారు.
అయితే ఆ రైతుని పెట్రోల్ బాటిల్ తో కార్యాలయంలోకి ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నించగా
తన గ్రామంలో పెట్రోల్ దొరకదని, తన వాహనానికి అవసరమైన పెట్రోల్ ఎప్పుడు పట్నం వచ్చినా ఇక్కడే కొనుగోలు చేసి తీసుకెళ్తానని తాపీగా చెప్పుకొచ్చాడు.
చూసారా పెట్రోల్ బాటిల్ ప్రస్తుతం ఎంత హడల్ ఎత్తిస్తుందో !.
ఆ హీరోలతో నటించాలని ఉందని చెప్పిన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి.. ఏమైందంటే?