వివాహేతర సంబంధం కారణంగా రైతు దారుణ హత్య..!

ఇటీవలే బయటపడుతున్న వివాహేతర సంబంధాలన్నీ చివరికి దారుణ హత్యలతో( Murder ) ముగుస్తున్నాయి.

కొన్ని వివాదాస్పద మరణాలను పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా అందులో చాలావరకు వివాహేతర సంబంధాల వల్లే జరిగిన హత్యలే.

ఈ క్రమంలోనే ఓ రైతు( Farmer ) వివాహేతర సంబంధం కారణంగా దారుణ హత్యకు గురైన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

కురిచేడులో రేకుల పెద్ద అంకయ్య (40) అనే వ్యక్తి గ్రామంలో వ్యవసాయం( Agriculture ) చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అంకయ్య అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

"""/" / శనివారం రాత్రి బయటకు వెళ్లిన అంకయ్య తిరిగి ఇంటికి రాలేదు.

దీంతో అతని కుమారుడితో పాటు కుటుంబ సభ్యులంతా చుట్టుపక్కల ప్రాంతాలు గాలించారు.అయితే ఆదివారం ఉదయం అక్రమ సంబంధం ఉన్న మహిళ ఇంటిముందు అంకయ్య మిగతాజీవిగా పడి ఉన్నాడు.

కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.త్రిపురాంతకం సీఐ పాపారావు, కురిచేడు ఎస్సై దేవకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

అంకయ్య తల తో పాటు మర్మాంగాలకు తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు. """/" / ప్రాథమిక విచారణలో అంకయ్యను హత్య చేసి, లుంగీని ఫ్యాన్ కి కట్టి ఉరివేసి, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు ( Police )అనుమానిస్తున్నారు.

సంఘటన స్థలంలో హత్యకు సంబంధించిన వివరాలు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహేతర కారణంగానే హత్య జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఏ వయసు వారు ఎంత నీటిని తాగాలి.. పసిపిల్లలకు ఏ నెల నుంచి వాటర్ పట్టాలి..?