నాంపల్లి కోర్టులో ఫామ్ హౌజ్ కేసు నిందితుడి కస్టడీ పిటిషన్ విచారణ
TeluguStop.com
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఇందులో భాగంగా నిందితుడు నందకుమార్ ను కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బంజారాహిల్స్ లో నమోదైన కేసులో భాగంగా ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పిల్ లో పేర్కొన్నారు.
మరోవైపు నందకుమార్ ను కస్టడీకి ఇవ్వొద్దని ఆయన తరపు న్యాయవాదుల కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో నందకుమార్ పై నమోదైన కేసుల వివరాలు తెలపాలని నాంపల్లి న్యాయస్థానం అడిగింది.
దీంతో సోమవారం నందకుమార్ కేసుల వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు.కేసుల వివరాలు పరిశీలించిన అనంతరం న్యాయస్థానం నందకుమార్ కస్టడీపై నిర్ణయం తీసుకోనుంది.
ఈ మేరకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
వీల్ చైర్ కోసం 10 వేల ఫీజు.. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఎన్ఆర్ఐకి చేదు అనుభవం