మెజిస్ట్రేట్ కు ఘనంగా వీడ్కోలు

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణ ఏడిఎం కోర్టు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక బదిలీపై వెళ్తుండగా కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సన్మాన సభను నిర్వహించి సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రిన్సిపుల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్యాంసుందర్ హాజరయ్యారు.

అనంతరం ఆయన పాటు పలువురు మాట్లాడుతూ ప్రియాంక చిన్నతనంలోనే జడ్జిగా నియమితులై ఫస్ట్ పోస్టింగ్ లో కోదాడకు రావడం, ఐదున్నర సంవత్సరాలు ఒకే చోట విధులు నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు.

అటు రాజీమార్గమే రాజమార్గం అన్న నినాదంతో ఎన్నో కేసులను పరిష్కరిస్తూ ఇటు ఎన్నో కేసులకు న్యాయబద్ధమైన జడ్జిమెంట్ ఇస్తూ,బార్ అసోసియేషన్ కు ఆదర్శప్రాయమైన ప్రతిభను కనబరిచి న్యాయ వ్యవస్థకే వన్నెతెచ్చిన ఘనత ఆమెకే దక్కిందని కొనియాడారు.

ఆమె మునుముందు మరెన్నో ఉన్నతమైన పదవులను పొందాలని,మరల బదిలీ అవకాశం వస్తే కోదాడ కోర్టును, ప్రేమానురాగాలను పంచే కోదాడ బార్ అసోసియేషన్ గుర్తుంచుకొని ఇక్కడికే రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగార్జున రావు,ఎస్.ఆర్.

కె.మూర్తి,సుధాకర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి,పాలేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వామ్మో.. ఏంటి భయ్యా.. ఆ ఇంట్లో పాములు కలిసి ఏమైనా పుట్ట పెట్టాయా ఏంటి..?